రిసెప్షనిస్ట్‌తో కమెడియన్ అసభ్యంగా.. పెద్ద హీరో లేకుంటే జైలుకే!
చిత్ర పరిశ్రమలో అనేక రకాల నటీమణులపై అనేక రకాల వేధింపులు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సంఘటల చిత్ర పరిశ్రమకు మచ్చలా ఏర్పడ్డాయి. అందరూ చెడ్డవారు కాకున్నా మహిళలని వేధించే వారు కొందరు టాలీవుడ్ లో ఉన్నారనే వాదన వినిపిస్తూనే ఉంది. ఓ స్టార్ కమెడియన్ గురించి వస్తున్న ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. స్టార్ హోటల్ లో జరిగిన పార్టీలో సదరు కమెడియన్ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

స్టార్ కమెడియన్
హైదరాబాద్ లోని ఓ హెటల్ లో సినీ హీరో ఏర్పాటు చేసిన పార్టీకి చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు హాజరయ్యారు. ఈ పార్టీకి టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా చలామణి అవుతున్న వ్యక్తి కూడా హాజరయ్యాడు. అతడు వయసులో పెద్ద వాడే. ఇప్పటికి బాగానే సంపాదిస్తున్నాడు. పలు సందర్భాల్లో అతడు వివాదాల్లో నిలిచినట్లు తెలుస్తోంది.

తాగిన మత్తులో
పార్టీలో సదరు కమెడియన్ పీకల దాకా మద్యం సేవించి కంట్రోల్ కోల్పోయినట్లు తెలుస్తోంది. అతడి భార్య కూడా అదుపు చేయలేకపోయిందట. తన భర్తని అక్కడే వదిలేసి డ్రైవర్ ని కారు స్టార్ట్ చేయమని చెప్పడానికి ఆమె లాబీల్లోకి వెళ్లిందట. ఈ గ్యాప్ లో ఆ కమెడియన్ భీభత్సం సృష్టించాడు. ఆ హోటల్ లో ఉన్న రిసెప్షనిస్ట్ తో చాలా అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.

సీరియస్ అయిన యాజమాన్యం
సదరు కమెడియన్ చేష్టలకు రిసెప్షనిస్ట్ భరించలేకపోయినట్లు తెలుస్తోంది. జరిగిన విషయాన్ని హోటల్ మేనేజర్ కు చెప్పడంతో సమస్య మరింత పెద్దదిగా మారింది. హోటల్ యాజమాన్యం మొత్తం సదరు హాస్యనటుడిపై బాగా సీరియస్ అయ్యారట. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్దమైనట్లు తెలుస్తోంది. అతడికి తగిన శాస్తి జరిగితేనే ఇలాంటి సంఘటలు రిపీట్ కాకుండా ఉంటాయని హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్దపడింది.

సెటిల్ చేసిన స్టార్ హీరో
తాను నిర్వహిస్తున్న పార్టీలో ఇలాంటి సంఘటన జరిగినట్లు బయటకు తెలియకూడదని స్టార్ హీరో జాగ్రత్త పడ్డట్లు తెలుస్తోంది. హోటల్ యాజమాన్యంతో మాట్లాడి వివాదాన్ని అక్కడితో సద్దుమణిగేలా చేశాడట. లేకుంటే ఈ సమయానికి స్టార్ కమెడియన్ అంటూ పిలవబడే ఆ వ్యక్తి జైల్లో ఉండేవాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











