మహేష్ ఇప్పట్లో దొరకనట్లే.. లైట్ తీసుకున్న మరో స్టార్ డైరెక్టర్?
స్టార్ హీరోలందరు ప్రస్తుతం చాలా బిజీ అవుతున్నారు. ఒకప్పుడు ఒక సినిమా పూర్తయితే గాని మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వని అగ్ర హీరోలు ఇప్పుడు ఏకంగా ఓకేసారి నాలుగైదు సినిమాలను లైన్ లో పెడుతుండడం విశేషం. ఇప్పటికే ప్రభాస్, పవన్ కళ్యాణ్, మెగాస్టార్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ వరుసగా నాలుగు ప్రాజెక్టులను లైన్ లో పెట్టగా ఇప్పుడు ఆ లిస్ట్ లో మహేష్ బాబు కూడా చేరిపోయాడు.
గతంలో ఎప్పుడు లేని విదంగా మహేష్ బాబు స్టార్ హీరో అయిన తరువాత మొదటిసారి నాలుగు సినిమాలను లైన్ లో పెట్టాడు. పరశురామ్ దర్శకత్వంలో ఇప్పటికే సర్కారు వారి పాట అనే సినిమాను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత త్రివిక్రమ్ సినిమాను రిలీజ్ చేయనున్నాడు. రెండు సినిమాలను ఒకేసారి ఫినిష్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు.

ఇక ఇటీవల దర్శకుడు అనిల్ రావిపూడి ఇచ్చిన క్లారిటీ ప్రకారం మహేష్ బాబుతో మరో సినిమా తప్పకుండా ఉంటుందని మరో క్లారిటీ వచ్చేసింది. అయితే ఆ సినిమా ఎప్పుడు వస్తుందనేది మరికొన్ని రోజుల్లో గెలిపోతుంది. అలాగే దర్శకధీరుడు రాజమౌళితో కూడా ఒక సినిమాకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి రావచ్చు. RRR ఎప్పుడైపోయినా కూడా మహేష్ బాబు రెడీగా ఉండాల్సిందే. ఎందుకంటే జక్కన్నతో సినిమా ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. అయితే ఇప్పుడు మహేష్ లైనప్ చూసి స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మహేష్ తో సినిమా ఇప్పట్లో చేయడం కుదిరేట్టు లేదని వెనుకడుగు వేసినట్లు సమాచారం. పూరి చెప్పిన ఒక కథపై మహేష్ బాగానే ఇంట్రెస్ట్ చూపించాడట. అయితే ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ కారణంగా కొన్నాళ్ళు టైమ్ అడగడంతో పూరి మరో హీరో కోసం వెతుకుతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











