RRR రైటర్ వెంటపడుతున్న స్టార్ హీరోలు.. క్రేజ్ మామూలుగా లేదు..

సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క టెక్నీషియన్ సరైన గుర్తింపు కోసమే ఎదురుచూస్తుంటారు. రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా కొందరు పెద్దగా పట్టించుకోరు. కానీ క్రెడిట్ ఇవ్వకపోతే మాత్రం కొంచెం కూడా తట్టుకోలేరు. ముఖ్యంగా రైటర్స్ ఆ క్రెడిట్ కోసం గత కొన్నేళ్లుగా కష్టపడుతూనే ఉన్నారు. అయితే రచయితగా ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరిని ఆకర్షిస్తున్న వ్యక్తి సాయి మాధవ్ బుర్ర.

దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన సినిమాలకు ఎక్కువగా ఆయనే మాటలు అందించారు. ఇక మహానటి సినిమా తరువాత ఆయన రేంజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం RRR సినిమాకు మాటలు అందిస్తున్నారు. ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక నెక్స్ట్ కూడా అలాంటి తరహాలోనే బీబ్ బడ్జెట్ సినిమాలకు మాటలు అందించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బి.గోపాల్, వివి.వినాయక్ లాంటి దర్శకలు ఆయన నుంచే కొన్ని కథలను అందుకున్నట్లు సమాచారం.

 Star directors and heroes wants RRR writer sai madhav burra stories

అదే విధంగా మరికొందరు కుర్ర హీరోలు కూడా సాయి మాధవ్ దగ్గర కథలను కొనేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొన్నటివరకు కోన వెంకట్, వక్కంతం వంశీ వంటి రచయితలు ఇండస్ట్రీలో ఎక్కువగా దర్శకులను ఆకర్షించే వారు. ఇక ఇప్పుడు ఎక్కువగా ఇండస్ట్రీలో సాయి మాధవ్ హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. కుదిరితే ఆయన కూడా డైరెక్షన్ లోకి దిగాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X