Balakrishna: ఇది కదా క్రేజ్ అంటే... ఈ జన్మకి బాలయ్యతో ఒక్క సినిమా చాలంటున్న స్టార్ డైరెక్టర్లు

బాలయ్య క్రేజ్ ఏ రేంజులో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక ఆయన చేసిన అన్ స్టాపబుల్ షో తర్వాత ఆయనకు ఉన్న ఇమేజ్ మరింత పెరిగింది. ఆయన ఆ షో కు ముందు ఓ ఫైర్ బ్రాండ్ అని అంతా అనుకునే వారు. ఇక ఆ షో తర్వాత ఆయన భోళా శంకరుడుగా గుర్తించారు. ఇక ఆయన ఆ స్టార్ డైరెక్టర్స్ వారి సినిమా బాలయ్యతో చేయాలని అనుకుంటున్నారట. వారెవరు.. ఆ వివరాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

నందమూరి బాలకృష్ణ.. ఈ మధ్య కాలంలో ఫుల్ జోష్ లో ఉన్నారు. కరోనా సమయంలోనే... సినీ ఇండస్ట్రీ సినిమాలు రిలీజ్ చేయడానికి భయపడుతుంటే... బాలయ్య మాత్రం అఖండ సినిమాతో వచ్చి... సూపర్ హిట్టు కొట్టాడు. ఇక ఆ తర్వాత అన్ స్టాపబుల్ షోతో.. ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. మొదటి సీజన్ సూపర్ హిట్ కావడంతో.. రెండో సీజన్ కూడా తెరకెక్కించారు. ఇక ఆ షో కూడా సూపర్ హిట్టుగా నిలిచింది.

Star Directors Who Want to Retire After Making One Movie With Balayya News Goes Viral

ఇక ఈ ఏడాది ప్రారంభంలో బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో వచ్చి... బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించారు. ఇక ఆయన తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా పక్కా హిట్ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

బాలయ్య భ‌గ‌వంత్ కేస‌రి సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ రు. 100 కోట్ల రేంజ్‌లో జ‌రుగుతుందని అంటున్నారు. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య బాబి సినిమా క‌మిట్ అయ్యాడు బాలయ్య. ఆ త‌ర్వాత వ‌రుస‌గా పూరి జ‌గ‌న్నాథ్‌, బోయ‌పాటి శ్రీను కూడా లైన్లో ఉన్నారని టాక్. ఈ మధ్యే ప్రశాంత్ వర్మతో కూడా ఓ పాన్ ఇండియా సినిమా అంటూ కథనాలు వస్తున్నాయి. ఇక ఇదే నిజమైతే బాలయ్య ఫ్యాన్స్ కు పునాకాలే అని చెప్పవచ్చు.

Star Directors Who Want to Retire After Making One Movie With Balayya News Goes Viral

ఇక ఇదిలా ఉండగా.. బాలయ్య గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. బాలయ్యతో తమ చివరి సినిమా తీయాలని ఓ ఇద్దరు స్టార్ డైరెక్టర్లు అనుకుంటున్నారట. అయితే వారు ఎవరో కాదు.. ఇప్పటికే బాలయ్యకు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్సే. వారు ఎవరో కాదు... డైరెక్ట‌ర్ బి. గోపాల్‌, సింగితం శ్రీనివాస్ రావు. గోపాల్ దర్శకత్వంలో బాలయ్య స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహానాయుడు లాంటి బ్లాక్‌ బ‌స్ట‌ర్ సినిమాలు వచ్చాయి. గోపాల్ తో త్వరలో సినిమా ఉంటుందంటూ వార్తలు అయితే వస్తున్నాయి.

ఇక బి గోపాల్ కూడా బాలయ్యకు తగ్గట్లుగా కథ రెడీ చేస్తున్నారని టాక్. ఇదిలా ఉండగా.. మ‌రో సినియ‌ర్ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీనివాస‌రావు కూడా బాల‌య్య కోసం ఆదిత్య 369కు సీక్వెల్‌గా ఆదిత్య 999 పేరుతో ఓ సినిమా చేస్తానంటూ రెండు, మూడేళ్లుగా టాక్ వస్తుంది. మ‌రి వీరిద్ద‌రి కోరిక బాల‌య్య ఎప్ప‌ట‌కి తీర్చుతాడో తెలయాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X