twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ భామల సొగసు రహస్యం?

    By Staff
    |

    వెందితెరపై సన్నగా మెరుపు తీగల్లా అగుపించే కథానాయికలు అలా కనిపించడానికి చేసే వర్కవుట్లు అన్నీ ఇన్నీ కావు. ఆహారం సరిగ్గా తీసుకోక కడుపు మాడ్చుకోవడం నుంచి కఠినమైన వ్యాయామాలు వరకు వాళ్లు ఎన్నో చేస్తారు. కాకపోతే, ఈ మధ్య కాలంలో 'జిమ్" కన్నా 'యోగా" కి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక యోగా చేసి శరీరాకృతిని మెయిన్టై న్ చేస్తున్న తారల గురించి తెలుసుకుందాం

    అనుష్క: కథానాయిక అవ్వకముందు అనుష్క యోగా టీచర్గా వ్యవహరించింది. సినీ ప్రముఖులకు సైతం ఆమె యోగా నేర్పించిందట. ఆ పరిచయాలే ఆమెని కథానాయికని ఛేశాయని చాలా మంది అంటారు. ఏదేమైనా యోగా చేసి ఈ బెంగళూరు బ్యూటీ కత్తిలాంటి ఫిగర్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికీ తన సహ నటీనటులకు అనుష్క యోగా టిప్స్ చెబుతుంటుంది.

    శ్రియ: ఇటీవలే యోగా క్లబ్లో చేరింది శ్రియ. రిలాక్సేషన్ కోసం హిమాలయాలకు వెళ్ళిందంట. అట్నుంచి కోయంబత్తూరుకి వెళ్ళియోగా క్లాసుల్లో పాల్గొంది శ్రియ. యోగా చేయడం ఆరంభించిన తర్వాత శరీరం తేలికగా ఉన్నట్లు అనిపించిందట. అందుకని, యోగా చేయడం ఆరంభించేసింది. అసలే, సన్నగా మెరుపు తీగలా ఉండే శ్రియ మరింతగా చిక్కి ఇంకా హాట్ గా కనిపిస్తోంది.

    భూమిక: మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న భూమిక యోగా చేయడం మొదలు పెట్టిన తర్వాత జీవితం మంచి మలుపు తీసుకుంది. తనకి యోగా నేర్పించిన గురువు భరత్ ఠాగూర్ తో ప్రేమలో పడి, పెళ్ళి కూడా చేసుకుంది. యోగా మాస్టర్ గా భూమిక భర్తకి మంచి పేరుంది. ఆయనగారి దగ్గర యోగా నేర్చేసుకుని భూమిక ఎంచక్కా స్లిమ్ గా ఉంటోంది.

    త్రిష: ఇతర కథానాయికలు సన్నబడి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారనే విషయం త్రిష మనసులో పడింది. వాళ్ళంతా ఏం చేస్తున్నారో ఆరా తీసింది. ఆ రహస్యం యోగా అని తెలుసుకున్న త్రిష అర్జంటుగా తను కూడా యోగా చేసే పనిలో పడింది. ఫలితం కనబడుతోంది. కాస్తంత మెరుపు, ఒంటి షేపూ చక్కగా కనబడుతున్నాయి.

    శిల్పాశెట్టి: పొడుగు కాళ్ళ సుందరి శిల్పాశెట్టి యోగా చేయడం ఆరంభించిన తర్వాత తనకెంతో బాగుంటుందని అంటోంది. మూడు పదుల వయసు దాటినప్పటికీ తన శరీరాకృతికి బాగుండడానికి కారణం యోగానేని ఒక సందర్భంలో ఈ బాలీవుడ్ భామ చెప్పింది. యోగా ద్వార తను పొందిన లాభాలు ఇతరులు కూడా పొందాలనే ఉద్ధేశ్యంతో ఏకంగా యోగా డీవీడీని రూపొందించి విడుదల చేసింది.

    ఇక ఈ కధానాయికలను ఆదర్శంగా తీసుకుని మరెంతమంది ఈ యోగా బాటని అనుసరిస్తారో వేచి చూద్దాం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X