స్పిరిట్‌లో మరో విలన్.. స్టార్ హీరోతో సందీప్ రెడ్డి టాక్స్.. ఎవరాయన అంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చివరగా ప్రభాస్ కల్కి 2898 ఏడి, అంతకుముందు సలార్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ రెండు చిత్రాలు ఆడియన్స్ నుంచి బ్రహ్మాండమైన ప్రశంసలను అందుకోవడం కాకుండా, బాక్సాఫీస్ వద్ద కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ను అందుకుంది. ఇక నెక్స్ట్ ప్రభాస్ నుంచి రాబోయే చిత్రాలపై ఫోకస్ పెట్టి ఉన్నారు.
ఈ క్రమంలో ప్రభాస్ నుంచి ప్రేక్షకుల ముందుకు రావాల్సిన మోస్ట్ అవైటెడ్ ఫిలిం స్పిరిట్. ఈ చిత్రానికి ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తుండడం విశేషం. ఇంకా ఈ చిత్రం పట్టాలు ఎక్కాల్సి ఉంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో సందీప్ రెడ్డి వంగ బిజీగా ఉన్నారు. అయితే ఈ చిత్రం ఇప్పటికే సెట్స్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ పలు కారణాలతో వాయిదా పడుతుంది. ప్రస్తుతం ప్రభాస్ తను సైన్ చేసిన ది రాజా సాబ్, ఫౌజీ వంటి చిత్రాల షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.

ఇక సందీప్ రెడ్డి వంగ అన్ని విధాలుగా స్పిరిట్ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభాస్ రెడీ అంటే నిర్విరామంగా 8 నెలల పాటు నాన్ స్టాప్ గా షూట్ చేయబోతున్నారంట. సెప్టెంబర్ చివరి వారంలో షూటింగ్ జరగబోతుందని సమాచారం. తప్పితే 2025 చివరి కల్లా షూటింగ్ ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించే ఆలోచనలో సందీప్ రెడ్డి వంగ ఉన్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది.
సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబినేషన్లో సినిమా రాబోతుండడం భారీ అంచనాలను నెలకొల్పింది. అయితే ఈ సినిమాకు ఇప్పటికే హీరోయిన్గా యానిమల్ మూవీ బ్యూటీ త్రిప్తి డిమ్రినీ ఎంపిక చేశారు. మరో హీరోయిన్ కూడా ఉంటుందని అంటున్నారు. ఇక విలన్ గా కొరియన్ నటుడు, ఇంటర్నేషనల్ యాక్టర్ డాన్లీ నటించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో మరొక స్టార్ హీరోను విలన్ పాత్ర కోసం ఎంపిక చేసే పనిలో ఉన్నారని అంటున్నారు.
ఆయన మరెవరో కాదు. సెన్సేషనల్ డైరెక్టర్, తన గురువుగా భావించే రాంగోపాల్ వర్మ ఫేవరెట్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ అని తెలుస్తోంది. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన కంపెనీ, డీ, రక్త చరిత్ర వంటి చిత్రాలతో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశారా ఆయన. ఇక ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విలన్ గా ప్రభాస్ తో కలిసి ప్రత్యర్థి పాత్రలో నటించబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో స్పిరిట్ చిత్రంపై మరింతగా అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. దీనిపై స్పష్టమైన అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది. స్పిరిట్ సినిమా కోసం ప్రభాస్ మరింత సన్నగా, స్టైలిష్ గా మారిపోతున్నారు. ఇక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు.


Click it and Unblock the Notifications











