twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు హీరోలు- రెమ్యునేషన్స్ ఎవరికెంత? (ఫోటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : అన్నీ పెరుగుతున్నాయి...హీరోల రెమ్యునేషన్స్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల రెమ్యునేషన్స్ అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి. బడ్జెట్ పెరుగుతున్నప్పుడు రెమ్యునేషన్ పెంచటంలో తప్పేమి అన్నట్లు హీరోలు డిమాండ్ చేస్తున్నారు. స్టార్ హీరోలతో బిజినెస్ కూడా అదే రేంజిలో జరుగుతూండటంతో నిర్మాతలు వెనకడుగు వేయటం లేదు.

    ముఖ్యంగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు రెమ్యునేషన్స్ అందరికీ ఆశ్చర్యపరిచే రీతిలో పెరిగాయి. ఇప్పటికే ఎవరూ ఊహించనంత రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ ఇద్దరూ మరో ఆసక్తికర విషయంతో వార్తల్లోకెక్కబోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో యూటివి మోషన్ పిక్చర్స్ సంస్థతో ఓ సినిమా చేయబోతున్నారు. దేశంలోని అతిపెద్ద సినీ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఈ సంస్థ మహేష్ బాబుతో చేసే చేయబోయే సినిమాకు రూ. 20 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

    మరో వైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో దక్షిణాది పెద్ద సినీ నిర్మాణ సంస్థలో ఒకటైన పివిపి బేనర్లో సినిమా చేయబోతున్నారు. వీరు కూడా పవన్ కళ్యాణ్‌కు రూ. 20 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. పవన్ కళ్యాన్ ఇటీవలే తన తాజా సినిమా 'అత్తారింటికి దారేది' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఈచిత్రం ఆగస్టు 7న విడుదలకు సిద్ధం అవుతోంది. మరో వైపు మహేష్ బాబు ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో '1'(నేనొక్కడినే) చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందు. ఈచిత్రం ఇప్పుడు యూరఫ్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది.

    గమనిక : క్రింద పేర్కొన్న హీరోల రెమ్యునేషన్స్ ట్రేడ్ లో ప్రచారంలో ఉన్నవి మాత్రమే..అవి ఖచ్చితమైన లెక్కలు కావచ్చు..కాకపోవచ్చు....పెరగవచ్చు..తగ్గవచ్చు... పూర్తి పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదు.

    టాప్ 10 హీరోలు...వారి రెమ్యునేషన్స్ స్లైడ్ షోలో...

    మహేష్ బాబు

    మహేష్ బాబు

    మొన్నీ మధ్యన వరకూ మహేష్ బాబు 10-12 కోట్ల వరకూ సినిమాకు తీసుకునేవారు. అయితే సుకుమార్ తో చేస్తున్న నేనొక్కడినే చిత్రం నుంచి 15 కోట్లకు రెమ్యునేషన్ పెంచారు. ఆ సినిమా థియోటర్స్ కు రాకముందే అతని రెమ్యునేషన్ పెరిగిపోయింది. 20 కోట్లకు రెమ్యునేషన్ ఆయన కొత్త చిత్రానకి పెంచినట్లు సమాచారం.

    ఇక మహేష్‌బాబు హీరో గా యూటీవీ మోషన్‌ పిక్చర్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించబోతోంది. 'మిర్చి'తో విజయాన్ని అందుకొన్న కొరటాల శివ దర్శకత్వం వహిస్తారు. 'అతిథి' తర్వాత యూటీవీ సంస్థ తెలుగులో నిర్మిస్తున్న చిత్రమిదే. వచ్చే యేడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. చిత్రబృందం మధ్య ఇటీవలే ఒప్పందం కుదిరింది.

    పవన్ కళ్యాణ్

    పవన్ కళ్యాణ్

    తెలుగులో అతి ఎక్కువ రెమ్యునేషన్ తీసుకునే హీరో ఎవరంటే పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు.. ఆయనకి గబ్బర్ సింగ్ నిమిత్తం 15 కోట్లు తీసుకున్నారని చెప్తారు. ఆయన అత్తారింటికి దారేది చిత్రానికి 20 కోట్లుకు రెమ్యునేషన్ పెంచారని తెలుస్తోంది. ఈ మేరకు రిలియన్స్ వారుతో ఒప్పందం చేసుకునే ఈ ప్రాజెక్టు చేపట్టారని చెప్పుకున్నారు. అయితే సినిమాకు ఓ రేంజిలో బిజినెస్ జరగటం అంతా హ్యాపీగా ఉన్నారు.

    జూ.ఎన్టీఆర్

    జూ.ఎన్టీఆర్

    బాద్షా వంటి యావరేజ్ టాక్ తెచ్చుకున్న చిత్రం కూడా భాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కురిపించింది. దాంతో ఎన్టీఆర్ కు తిరుగులేకుండా పోయింది. దానికి తోడు ఆయన క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసుకుంటున్నారు. తాజాగా హరీష్ శంకర్ తో చేస్తున్న చిత్రం నిమిత్తం 10 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. రామయ్య వస్తావయ్యా హిట్టైతే రెమ్యునేషన్ ఓ రేంజిలో పెరిగే అవకాసం ఉంది.

    రామ్ చరణ్ తేజ

    రామ్ చరణ్ తేజ

    చిరంజీవి కుమారుడుగా వెండి తెరపై తెరంగ్రేటం చేసిన రామ్ చరణ్ తేజ...తన సత్తాతో తనను తాను నిలబెట్టుకున్నారు. మగధీర నుంచి ఆయన కు తిరుగు లేకుండా పోయింది. నాయక్, రచ్చ భాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్ స్టామినా ఏమిటో తేల్చి చెప్పాయి. ఆయన ఎన్టీఆర్ తో సమానంగా...10 కోట్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

    రవితేజ

    రవితేజ



    టాలీవుడ్ మాస్ మహారాజగా పేరు తెచ్చుకున్న రవితేజ కి వరస ఫ్లాపులు పడ్డాయి. దాంతో రెమ్యునేషన్ విషయంలో ఆయన డల్ గానే ఉన్నారు. అయితే బలుపుతో ఆయన ఒక్కసారిగా పుంజుకున్నారు. ఇప్పుడు ఆయన ఐదు నుంచి ఏడు కోట్లు వరకూ రెమ్యునేషన్ పెంచినట్లు తెలుస్తోంది.

    ప్రభాస్

    ప్రభాస్

    రీసెంట్ గా మిర్చి చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రబాస్ కు మాస్ లో మంచి ఛరిష్మా ఉన్నా సరైన హిట్ లు పడక అలా లాగుతూ వస్తున్నారు. ఆయన తన సినిమాకు 4 కోట్లు చొప్పున తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న బాహుబలి చిత్రానికి 6 కోట్లు రెమ్యునేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం ఎక్కువ రోజులు వర్క్ చేయాలి కాబట్టి ఆ రేంజిలో డిమాండ్ చేసినట్లు చెప్పుకుంటున్నారు.

    నాగార్జున

    నాగార్జున


    దాదాపు ముప్పై ఏళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మన్మధుడు నాగార్జున. ఆయన ఈ వయస్సులో కూడా గ్రీకు వీరుడులా కనిపించి మెస్మరైజ్ చేసారు. ఆయన యంగ్ హీరోలతో నటనలోనే కాదు...రెమ్యునేషన్ విషయంలోనూ పోటీ పడుతున్నారు. ఆయన దాదాపు 5 కోట్లు వరకూ రెమ్యునేషన్ ఛార్జ్ చేస్తున్నారు.

    వెంకటేష్

    వెంకటేష్

    మరో సీనియర్ నటుడు వెంకటేష్ ఈ మధ్య వరస పరాజయాలతో వెనకపడ్డారు. 1986 లో కెరీర్ ప్రారంభించిన ఆయన ఎప్పుడూ రెమ్యునేషన్ విషయంలో ముందే ఉండేవారు. ఇప్పటికీ ఎనర్జీతో వెలిగే వెంకీ ఫ్యామిలీ హీరో. ఆయన సినిమాల శాటిలైట్ రైట్స్ కు ఎప్పుడూ డిమాండే. దాంతో ఆయనకు 5 కోట్లు రెమ్యునేషన్ పే చేస్తున్నట్లు సమాచారం.

    అల్లరి నరేష్

    అల్లరి నరేష్

    కామెడీకి కేరాఫ్ ఎడ్రస్ గా మారిన అల్లరి నరేష్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాకు చిన్నా పెద్దా తేడా లేకుండా క్యూ కడతారు. రీసెంట్ గా వచ్చిన వరస సినిమాలు ఫెయిల్యూర్ అయినా ఆయన డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. సుడిగాడు సినిమాతో ఆయన బడ్జెట్ పెరిగింది. ఆయన రెమ్యునేషన్ 4 కోట్లకు చేరిందని టాక్.

    English summary
    News which has been spreading in Filmnagar is that all the star heroes of Telugu Film Industry have increased their fees. Reports show that Prince Mahesh Babu, Power Star Pawan Kalyan, Mega Power star Ram Charan Tej and Young Tiger NTR have increased their working charges rapidly.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X