Vishal Marriage: స్టార్ హీరో చెల్లెలితో విశాల్ పెళ్లి ఫిక్స్... తమిళ పరిశ్రమ షేక్ అయ్యేలా!

కోలివుడ్ సీనియర్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విశాల్ తెలుగు వాడు అయినప్పటికీ.. కోలీవుడ్ లో సెటిల్ అయిపోయాడు. అక్కడ సినిమాలు చేస్తూ... స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఇప్పటికే 40 ఏళ్లు దాటాయి. ఇక ఆయన పెళ్లిపై నిత్యం ఏదో ఒక వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు విశాల్ పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. త్వరలో ఆయన పెళ్లి జరగనుందని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...

స్టార్ హీరో విశాల్ కు.. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు వాడు అయినప్పటికీ.. తమిళ సినిమాలు చేస్తూ.. అక్కడ స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ఆయన పెళ్లి గురించి నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి. అవి ఎప్పటికప్పుడు ఫేక్ అని తెలుతూ వస్తున్నాయి. విశాల్ వయసు 40 ఏళ్లు దాటేసిన ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. విశాల్ పెళ్లి ఎప్పుడు అంటూ కోలీవుడ్ లో వార్తలు గుప్పమంటున్నాయి.

Vishal Marriage

గతంలో విశాల్ కు హైదరాబాద్ కు చెందిన ఓ అమ్మాయితో నిశ్చితార్థం జరిగనట్లు.. త్వరలోనే వీరి పెళ్లి అని వార్తలు వచ్చాయి. అయితే వారి మధ్య బ్రేకప్ జరిగిందని వార్తలు వచ్చాయి. అంతకుముందు కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తె హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ విశాల్ ప్రేమలో ఉన్నారని.. ప్రచారం జరిగింది.. త్వరలో వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ప్రచారం సాగింది.

విశాల్, వరలక్ష్మి గురించి ఎన్ని వార్తలు వచ్చినా... తామిద్దరం మంచి స్నేహితులు అంటూ చెప్పుకొచ్చారు. వారి పెళ్లి గురించి ఏనాడు ఓపెన్ అవలేదు. ఇది ఇలా ఉంటే మరో వార్త బయటకు వచ్చింది. ఓ స్టార్ హీరో చెల్లెలితో పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్. అదేంటి అజిత్ కుమార్ చెల్లెలితో విశాల్ పెళ్లా అని ఆశ్చర్య పోతున్నారా...

Vishal Marriage Fix Heroine Laxmi Menon

అజిత్ నటించిన వేదాళం సినిమాలో లక్ష్మీ మీనన్ చెల్లెలి పాత్రలో నటించింది. ఆమెతో విశాల్ పెళ్లి ఫిక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ హీరోయిన్ తో విశాల్‌ పెళ్లి జరగబోతుందంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.లక్ష్మీ మీనన్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్. ఆమె తీసిన సినిమాలు అన్ని సూపర్ హిట్టుగా నిలిచాయి. ప్రస్తుతం లక్ష్మీ మీనన్ చంద్రముఖి 2 సినిమాలో నటిస్తోంది. 27 ఏళ్ల లక్ష్మీ మీనన్ త్వరలో పెళ్లి చేసుకోబోతుందన్న ప్రచారం తమిళనాడు జరుగుతోంది. నటుడు విశాల్‌తోనే ఆమె పెళ్లి జరగబోతుందని కోలీవుడ్ వర్గాల సమాచారం.

Vishal Marriage Fix Heroine Laxmi Menon

ప్రస్తుతం విశాల్ లక్ష్మీ మీనన్.. ప్రేమ పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరూ గతంలో నటించిన సినిమాల విషయానికి వస్తే... పల్నాడు, ఇంద్రుడు వంటి సినిమాల్లో నటించారు. ఈ రెండు సినిమాల్లో విశాల్‌ తో ఆమె కెమిస్ట్రీ బాగా కుదిరిందని.. వీరిద్దరి మధ్య పాత స్నేహం అలా కంటిన్యూ అవుతూ ప్రేమగా మారిందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X