Vishal Marriage: ఆ హీరోయిన్‌తో విశాల్ పెళ్లంటూ ప్రచారం.. అసలు విషయం చెప్పేశారుగా
అభిమాన హీరోలు, హీరోయిన్ల గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఓ రూమర్స్ వస్తూనే ఉంటాయి. అందులో నిజం ఉన్నా లేకపోయినా ఆ వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా హీరో విశాల్ పెళ్లంటూ ఈ మధ్య కథనాలు వెలువడ్డాయి. అది కూడా ఓ ప్రముఖ హీరోయిన్ తో విశాల్ ప్రేమలో ఉన్నారు.. త్వరలోనే పెళ్లి అంటూ ప్రచారం సాగింది. ఈ వార్తలపై హీరో విశాల్ టీం స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే...
హీరో విశాల్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి తెలుగు కుర్రాడు అయినప్పిటికీ.. కోలివుడ్ లో విశాల్ సెటిల్ అయి.. అక్కడే సినిమాలు చేస్తూ ప్రేక్షుకులను అలరిస్తున్నారు. అంతే కాదు.. ఆయన సినిమాలు ఇక్కడ కూడా రిలీజ్ చేసి... తెలుగు వారికి దగ్గరయ్యారు. ఇక ఈ ఏడాది విశాల్ లాఠి అనే పాన్ ఇండియా సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా పడింది.

అయితే విశాల్ వయసు దాదాపు 40 ఏళ్లు. ఆయన పెళ్లి వార్తలపై నిత్యం మీడియాలో ఏదో ఒక న్యూస్ హల్ చల్ చేస్తూనే ఉంటుంది. గతంలో విశాల్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీరు డైటింగ్ చేస్తున్నారని... త్వరలో పెళ్లి చేసుకోబుతన్నట్లు న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఇక దీనిపై అటు విశాల్.. ఇటు వరలక్ష్మి శరత్ కుమార్ క్లారిటీ ఇవ్వలేదు కానీ.. మేం ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చారు.

ఇక తాజాగా విశాల్ మరో స్టార్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డారని వార్తలు గుప్పుమన్నాయి. ఆమె ఎవరో కాదు.. హీరోయిన్ లక్ష్మీ మీనన్. ఈమె వయసు దాదాపు 27 ఏళ్లు. ఇక ఈ బ్యూటీ... విశాల్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. అంతే కాదు... తమిళ పరిశ్రమ షేక్ అయ్యేలా వీరి వివాహం త్వరలో జరగనుందని కోలివుడ్ మీడియా కోడై కూస్తోంది.

అయితే విశాల్, లక్ష్మీమీనన్ పెళ్లి వార్తలపై విశాల్ టీం స్పందించింది. అసలు ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పుకొచ్చింది. ''హీరో విశాల్ ఓ నటితో డేటింగ్‌లో ఉన్నారని, వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని వార్తలు రావడంతో ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే, ఇది పూర్తిగా ఫేక్ న్యూస్''.. అని విశాల్ టీమ్ స్పందించింది.

విశాల్ వివాహం గురించి అనేక కథనాలు వచ్చాయి. ఇలాంటి వార్తలను నమ్మవద్దని మేం అందరినీ అభ్యర్థిస్తున్నాం. అవి పూర్తిగా ఫేక్. ఇలాంటి రుమార్స్ వ్యాప్తి చేయడం మానుకోండి... అని విశాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇక విశాల్ ప్రస్తుతం మార్క్ ఆంథోని చిత్రంలో నటిస్తున్నారు. ఇది వినాయక చతుర్థి కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది.


Click it and Unblock the Notifications











