For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహేశ్ - రాజమౌళి మూవీపై సంచలన వార్త: బడా ప్రాజెక్టులో మరో స్టార్ హీరో.. దాని తర్వాత ప్రకటన

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్‌పై ప్రత్యేకమైన బజ్ ఏర్పడుతుంది. పలానా వాళ్ల కలయికలో సినిమా వస్తే చూడాలని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా వేచి చూస్తుంటారు. అలాంటి వాటిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళి కాంబో ఒకటి. చాలా కాలంగా వీళ్లిద్దరి సినిమా కోసం తెలుగు ప్రేక్షకుల ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది దీన్ని ప్రకటించారు. కానీ, ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి సంచలన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఆ సంగతులు మీకోసం!

  రాజమౌళి అలా.. మహేశ్ బాబు ఇలా

  రాజమౌళి అలా.. మహేశ్ బాబు ఇలా

  ‘బాహుబలి'తో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం అతడు RRRను తెరకెక్కిస్తున్నాడు. ఈ భారీ మూవీలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఇక, ఈ మధ్య వరుసగా హిట్లను అందుకుంటున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ క్రమంలోనే ఇప్పుడు పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట' అనే మూవీ చేస్తున్నాడు.

  Bigg Boss 5 నుంచి మరో కంటెస్టెంట్ పేరు లీక్: అల్లరి నరేష్ హీరోయిన్ ఎంట్రీ.. మరింత ఫన్ గ్యారెంటీ!

  క్రేజీ ప్రాజెక్టును ప్రకటించిన రాజమౌళి

  క్రేజీ ప్రాజెక్టును ప్రకటించిన రాజమౌళి

  తెలుగు సినీ ప్రియులంతా ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న కాంబినేషన్‌పై రాజమౌళి గత ఏడాది ప్రకటన చేశాడు. తన తదుపరి సినిమాను మహేశ్ బాబుతో చేస్తున్నట్లు అందులో వెల్లడించాడు. దీన్ని కేఎల్ నారాయణ నిర్మించబోతున్నారు. అయితే, ఈ సినిమా నేపథ్యం గురించి మాత్రం ఆయన ఎటువంటి ప్రకటనా చేయలేదు. దీంతో ఈ ప్రాజెక్టుపై ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

  తండ్రి చేతిలో బాధ్యత పెట్టిన జక్కన్న

  తండ్రి చేతిలో బాధ్యత పెట్టిన జక్కన్న

  ఎప్పటి నుంచో వేచి చూస్తోన్న కాంబినేషన్ కావడంతో రాజమౌళి - మహేశ్ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకనుగుణంగానే ఈ సినిమా కథను తయారు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీని బాధ్యతను తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు అప్పగించాడట జక్కన్న. ఆయన చాలా రోజులుగా ఈ మూవీ కథపై వర్క్ చేస్తున్నారట. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు.

  మూవీ కథ గురించి రకరకాల వార్తలు

  మూవీ కథ గురించి రకరకాల వార్తలు

  మహేశ్ బాబు.. రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న ప్రాజెక్టు గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ ఇదేనంటూ ఇప్పటికే కొన్ని లైన్లు తెరపైకి వచ్చాయి. అందులో ఇది సైన్స్ ఫిక్షన్ నేపథ్యం ఉన్న కథతో రూపొందనుందని.. రాజుల కాలం నాటి స్టోరీతో వస్తుందని.. అడ్వెంచర్ కథతో రూపొందుతుందని వార్తలు వస్తున్నాయి.

  రాజమౌళి చెప్పడంతో త్రివిక్రమ్‌కు ఓకే

  రాజమౌళి చెప్పడంతో త్రివిక్రమ్‌కు ఓకే

  నిజానికి రాజమౌళి.. మహేశ్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ఈ ఏడాది ద్వితియార్థంలోనే మొదలవుతుందని అంతా అనుకున్నారు. కానీ, కరోనా కారణంగా RRR వాయిదా పడడంతో ఈ ప్రాజెక్టు కూడా ఆలస్యం అవుతోంది. ఇక, రాజమౌళి సూచన మేరకు మహేశ్ బాబు.. త్రివిక్రమ్‌తో సినిమాను చేస్తున్నాడని అంటున్నారు. దీని తర్వాత అది ప్రారంభం అవుతుందని టాక్.

  మల్టీస్టారర్‌గా రాజమౌళి, మహేశ్ ఫిల్మ్

  మల్టీస్టారర్‌గా రాజమౌళి, మహేశ్ ఫిల్మ్


  తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రానున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళి ప్రాజెక్టు గురించి తరచూ ఏదో ఒక న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దీని గురించి ఓ సంచలన న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ చిత్రం మల్టీస్టారర్‌గా రూపొందనుందట.

  అందాలు ఆరబోస్తూ సెగలు రేపుతోన్న బాలయ్య హీరోయిన్: బ్యూటీ దెబ్బకు సోషల్ మీడియా షేక్

  బడా ప్రాజెక్టులో మరో స్టార్ హీరో ఎంట్రీ

  బడా ప్రాజెక్టులో మరో స్టార్ హీరో ఎంట్రీ

  తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మహేశ్ బాబు.. రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో కూడా భాగం కాబోతున్నారట. ఆ హీరో ఎవరన్నది క్లారిటీ రాలేదు కానీ.. తమిళ సినీ ఇండస్ట్రీలోని ఓ బడా హీరో అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన మహేశ్ పుట్టినరోజున వస్తుందని సమాచారం. ఇక, ఆ హీరో ఎవరన్నది RRR రిలీజ్ తర్వాతనే రివీల్ చేస్తారని తెలిసింది.

  English summary
  Tollywood Top Director SS Rajamouli confirms film with Mahesh Babu. This Movie Produced by KL Narayana with Huge Budget. This Project wiil be Starting From Sankranthi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X