రాంచరణ్ మూవీలో పవన్ కల్యాణ్, సల్మాన్ ఖాన్.. శంకర్ హై వోల్టేజ్ స్ట్రాటజీ.. మరో ఇద్దరు కూడా..

టాలీవుడ్ బడా కాంబినేషన్స్ పై వచ్చే అప్డేట్స్ చూస్తుంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయి. అగ్ర హీరోల బడా దర్శకుల కాంబో ఇండస్ట్రీలో హై వోల్టేజ్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇతర ఇండస్ట్రీలోని దర్శకులు కూడా మన అగ్ర హీరోలతో వర్క్ చేస్తున్నారు. అందులోను మల్టీస్టారర్ కథలు సెట్ చేసుకోవడం విశేషం. ఇక శంకర్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో కూడా కొంతమంది అగ్ర హీరోలు నటించబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఇండస్ట్రీకొక హీరో నటించే ఛాన్స్ ఉందట.

శంకర్ సినిమాలో కూడా..

శంకర్ సినిమాలో కూడా..

ప్రస్తుతం రామ్ చరణ్ RRR సినిమాకు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో మరొక హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక శంకర్ తో చేయబోయే రామ్ చరణ్ 15వ సినిమాలో కూడా అగ్ర హీరోలు నటించనున్నట్లు టాక్.

బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్

బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్

సినిమాలో రామ్ చరణ్ ఒక యువ పొలిటికల్ లీడర్ గా కనిపిస్తాడని టాక్ వస్తోంది. ఇక సినిమాలో ఒక 30 నిమిషాల ముఖ్యమైన పవర్ఫుల్ పాత్ర కోసం నాలుగు భాషలకు సంబంధించిన హీరోలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారట. ముందుగా బాలీవుడ్ వెర్షన్ కోసం సల్మాన్ తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

తమిళ్ లో విజయ్ సేతుపతి

తమిళ్ లో విజయ్ సేతుపతి

ఇక తమిళ వెర్షన్ కోసం విజయ్ సేతుపతిని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. శంకర్ ఎప్పటి నుంచో సేతుపతితో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఇక ఆ నటుడికి కూడా శంకర్ తో వర్క్ చేయాలని ఉందని చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు. రామ్ చరణ్ లాంటి అగ్ర హీరోతో స్క్రీన్ చేసుకోవడం అంటే సేతుపతి పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చని తెలుస్తోంది.

కన్నడలో కన్ఫ్యూజన్..

కన్నడలో కన్ఫ్యూజన్..

ఇక కన్నడ ఇండస్ట్రీలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అనే విషయంలో పెద్ద కన్ఫ్యూజన్ నడుస్తోంది. మొదట శంకర్ కు తనకు ఇష్టమైన ఉపేంద్రనే సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. అలాగే సుదీప్ ని కూడా మరొక ఆప్షన్ గా అనుకుంటున్నట్లు సమాచారం.

Recommended Video

Akhanda Movie తో మరో స్టార్ హీరో కి లైఫ్ ఇవ్వబోతున్న బాలయ్య బాబు!! || Filmibeat Telugu
పవన్ కళ్యాణ్ / మెగాస్టార్ చిరంజీవి?

పవన్ కళ్యాణ్ / మెగాస్టార్ చిరంజీవి?

ఇక ఫైనల్ గా తెలుగులో మరో పెద్ద సస్పెన్స్ కొనసాగుతోంది. మొదటి నుంచి వస్తున్న రూమర్ గురించి అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ స్పెషల్ పాత్రలో నటించబోతున్నట్లు సినిమా ఎనౌన్స్మెంట్ వచ్చిన మరుసటి రోజే ఈ టాక్ వైరల్ అయ్యింది. ఇక పవన్ కళ్యాణ్ లేకపోతే చిరంజీవి నటించవచ్చని టాక్ వస్తోంది. ఆల్రెడీ ఆచార్యలో రామ్ చరణ్ తండ్రితో కలిసి నటించాడు కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్ తో నటిస్తే ఆ బజ్ మాములుగా ఉండదు. మరి ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X