పవన్ ‘పులి’ పై స్టార్ హీరోల రియాక్షన్....
ఈ మధ్య కాలంలో సినిమా ప్రముఖులందరూ 'ట్విట్టర్" లో ఎకౌంట్ ఓపెన్ చేసి తమ మనోభావాలను చెబుతున్నారు. ముఖ్యంగా విడుదల కాబోయే సినిమాల గురించి, విడుదలైన సినిమాల గురించి కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. కేవలం తమ సినిమాలనే కాకుండా ఇతరుల సినిమాల గురించి కూడా పలువురు హీరోలు ట్విట్టర్ లో నాలుగు మంచి మాటలు చెబుతున్నారు.
పాటలు అదుర్స్: సిద్దార్థ్, 'కొమరం పులి" ఆడియో సీడీ కొన్నాను. ఇంతటి అద్బుతమైన ఆల్బమ్ ను 60 రూపాయలకే సోనీ సంస్థ అందించడం గొప్ప విషయం. ఈ ఆడియోలో 'మారాలంటే..", 'దోచెయ్..'పాటలు నా హదయాన్ని హత్తుకున్నాయని, పాటలు అదుర్స్ అని సిద్దార్థ్ అన్నారు.
సినిమా అదుర్స్ అని విన్నా: రామ్, కొమరం పులి" పాటలు బాగున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా కూడా అదిరిపోయే రేంజ్ లో ఉందన్నది ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాకి బాగా హైప్ వచ్చింది. పవర్ స్టార్ అనే టైటిల్ పవన్ కళ్యాణ్ కు సరిగ్గా సరిపోతుందని అంటున్నారు రామ్.
కరెక్ట్ చాయిస్: రాణా, 'పులి" ప్రోమోస్ చూశాను. చాలా బాగున్నాయి. సినిమా యాక్షన్ ఫ్యాక్డ్ గా ఉంది. నేను 'లీడర్" సినిమా షూటింగ్ లోకి ఎంటర్ అవ్వకముందే ఈ సినిమా గురించి తెలుసుకున్నాను.. లీడర్ సినిమాలో నటించాలన్న నీ ఛాయిస్ కరెక్ట్ అని పవన్ కళ్యాణ్ అన్నారు. ముంబయ్ లో ఉన్నాను కాబట్టి 'కొమరం పులి" ఆడియో సీడీ దక్కించుకోలేకపోయాను. తర్వరలోనే ఈ పాటలు వింటాను. 'కొమరం పులి" గురించి మూడే మూడు ట్వీట్ లు వచ్చాయి. ఆ ట్వీట్ లకు 100కి పైగా స్పందన వచ్చింది. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ నటించిన చిత్రాల్లో నాకు నచ్చిన డైలాగ్ 'బద్రి"లోని..'నువ్వు నందా అయితే నేను బద్రి, బద్రీనాథ్."


Click it and Unblock the Notifications











