49 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరోయిన్... ఎవరో తెలుసా?

సీనియర్ హీరోయిన్ నగ్మా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1990లో బాలీవుడ్​లో భాగీ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ భామ టాలీవుడ్​లో స్టార్ హీరోయిన్​గా రాణించింది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్​ సహా పలువురు స్టార్​ హీరోలతో నటించి అతి తక్కువ కాలంలోనే సూపర్ క్రేజ్ సంపాదించుకుంది.

అయితే ఈమె వయసులో ఉన్న పలువురు హీరోలతో, ఓ క్రికెటర్​తో ప్రేమాయణం నడిపినప్పటికీ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. 49ఏళ్ల వయసులోనూ సింగిల్​గానే ఉంటోంది. అయితే తాజాగా ఈమె పెళ్లి గురించి మాట్లాడింది. తన మనసులోని మాటలను బయట పెట్టింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందో స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం...

Star Heroine Nagma is ready for marriage at the age of 49

పెద్దింటి అల్లుడు చిత్రంతో ఇక్కడి వారికి పరిచయమైంది సీనియర్ నటి నగ్మా. తన తొలి చిత్రంతోనే హీరోయిన్​గా మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ ఆ రోజుల్లో యూత్​లో పిచ్చ క్రేజ్​ను సంపాదించుకుంది. ముఖ్యంగా తన అందంతో యూత్​కు డ్రీమ్​ గర్ల్​గా కూడా మారింది. ఆ రోజుల్లో ఆమె అందానికి కుర్రాళ్లు ఫిదా అయిపోయేవారు. క్రేజ్​కు తగ్గట్టే ఈమె కూడా ఏడాదికి దాదాపు నాలుగైదు సినిమాల్లో నటిస్తూ హీరోయిన్​గా ఓ వెలుగు వెలిగింది.

కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, భోజ్​పురి భాషల్లోనూ నటిస్తూ సక్సెస్​పుల్​గా హీరోయిన్​గా పేరు తెచ్చుకుంది. అలా టాప్ హీరోయిన్​గా రాణిస్తున్న సమయంలోనే ఆమె వ్యక్తిగత జీవితం ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండేది. ఈ ముద్దుగుమ్మ పలువురు హీరోలతో రిలేషన్​షిప్స్​ మెయిన్​టెయిన్​ చేసిందంటూ ఎన్నో పుకార్లు బయటకొచ్చాయి. ఆమెపై రకరకాల వార్తలు నెట్టింట్లో కనిపించేవి. వీరిలో ముగ్గురు స్టార్ హీరోలు, ఒక క్రికెటర్ కూడా ఉన్నారు.

నగ్మా అప్పటికే పెళ్లైన టీమ్​ ఇండియా మాజీ కెప్టెన్ గంగూలీతో ఘాటు ప్రేమాయణం నడిపిందని అప్పట్లో ఫుల్ హాట్ టాపిక్ అయింది. అనంతరం రాధిక ప్రస్తుత భర్త శరత్ కుమార్​తో ఎఫైర్ నడిపిందని ఎన్నో వార్తలు వినిపించాయి. భోజ్​పురిలో సూపర్ స్టార్ రవి కిషన్‌తో చాలా చిత్రాల్లో నటించిన నగ్మా రియల్​ లైఫ్​లోనూ కెమిస్ట్రీ నడిపిందని బాగా పుకార్లు వినిపించాయి. ఆ తర్వాత మరో భోజ్​పురి నటుడు మనోజ్ తివారీతోనూ ప్రేమాయణం నడిపిందని ప్రచారం సాగింది. ఇలా పలువురు హీరోలతో రిలేషన్ లో ఉందంటూ ప్రచారంలో మరింత పాపులర్​ అయిన నగ్మా చివరికి ఎవరిని పెళ్లి చేసుకోకుండా సింగిల్​గానే ఉండిపోయింది.

Star Heroine Nagma is ready for marriage at the age of 49

అయితే ఒంటరి జీవితాన్ని గడుపుతున్న నగ్మా ఆ మధ్య తొలిసారి పెళ్లిపై తన మనసులోని మాటను చెప్పింది. పెళ్లి చేసుకోకూడదు అనే ఆలోచన తనకు లేదని, పిల్లలు కావాలన్న ఆశ తనకు కూడా ఉందని చెప్పింది. ఒకవేళ కాలం కలిసొస్తే పెళ్లి అవుతుందేమో చూడాలి అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్​ అవుతున్నాయి. కాగా, నగ్మా 2008 నుంచి పూర్తిగా సినిమాలకు దూరమైంది. 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లోనే బీజీగా ఉంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X