విశ్వంభరలో స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్.. ఆ ఇద్దరు హాట్ బ్యూటీలకే చిరంజీవి ఓటు

ఇప్పుడు టాలీవుడ్‌లోని చాలా మంది హీరోలు సినిమాల వేగాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో కొందరు మాత్రం వరుసగా మూవీల మీద మూవీలు చేస్తూ దూసుకెళ్తున్నారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత రచ్చ లేపుతోన్న ఆయన.. ఇప్పటికే చాలా చిత్రాలతో వచ్చి ప్రేక్షకులను, అభిమానులను ఓ రేంజ్‌లో అలరించారు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' అనే సినిమాను చేస్తోన్న విషయం తెలిసిందే. 'బింబిసార' ఫేం మల్లిడి వశిష్ట రూపొందిస్తోన్న ఈ చిత్రం సోషియో ఫాంటసీ జోనర్‌లో రాబోతుంది. దీంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీని క్రేజీగా రూపొందిస్తున్నారు. ఇందుకోసం చిత్ర యూనిట్ భారీ బడ్జెట్‌ను కూడా కేటాయించింది.

Star Heroine Special Song in Chiranjeevi Starrer Viswambhara Movie

మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో రాబోతున్న 'విశ్వంభర' మూవీకి సంబంధించిన షూటింగ్‌ ఆ మధ్యనే మొదలైంది. ఇందులో భాగంగానే పలు షెడ్యూళ్లను ప్లాన్ చేసి క్రేజీ సీన్స్‌ను షూట్ చేశారు. ఇలా ఇప్పటి వరకూ 40 శాతం పైగానే టాకీ పార్టును కంప్లీట్ చేసుకున్నా. ఇలా మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసుకునేలా ప్లాన్లు చేసుకుంటున్నారు.

ముల్లోకాలు కాన్సెప్టుతో రాబోతున్న 'విశ్వంభర' చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో పలు భాషల్లో తెరకెక్కించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడం కోసం ఓ స్టార్ హీరోయిన్‌ను తీసుకోబోతున్నారని తాజాగా న్యూస్ బయటకు వచ్చింది.

Star Heroine Special Song in Chiranjeevi Starrer Viswambhara Movie

టెక్నికల్ వండర్‌గా రాబోతున్న 'విశ్వంభర' మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌ను పెడుతున్నారని గతంలోనే న్యూస్ లీకైంది. అంతేకాదు, ఇందులో స్టార్ హీరోయిన్ కనిపించబోతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి శృతి హాసన్ లేదా తమన్నా భాటియాలలో ఒకరిని తీసుకోవాలని డైరెక్టర్‌కు చెప్పినట్లు తెలిసింది. వీళ్లిద్దరిలోనే ఒకరు ఈ సాంగ్‌ను చేయబోతున్నారని సమాచారం.

Star Heroine Special Song in Chiranjeevi Starrer Viswambhara Movie

ఇదిలా ఉండగా.. చిరంజీవి - వశిష్ట కలయికలో రూపొందుతోన్న 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, సురభి, అషికా రంగనాథ్, ఇషా చావ్లా, నవీన్ చంద్రలు కీలక పాత్రలు చేస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నారు.. ఈ సినిమాను 2025 జనవరి 10 తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X