అందర్నీ కొట్టేసాడు: ఎన్టీఆర్ ‘బిగ్ బాస్’ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
త్వరలో ‘బిగ్ బాస్’ తెలుగు వెర్షన్ రియాల్టీ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్న జూ ఎన్టీఆర్..... ఇప్పటి వరకు తెలుగు బుల్లితెర రంగంలో ఎవరూ తీసుకోనంత రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు టాక్.
హైదరాబాద్: వెండితర అగ్రతారలు బుల్లితెరపై పెద్ద పెద్ద గేమ్ షోలను హెస్ట్ చేస్తుండటం ఈ మధ్య ట్రెండుగా మారింది. బాలీవుడ్లో మొదలైన ఈ ట్రెండ్ ఇపుడు టాలీవుడ్లోనూ క్రమంగా ఊపందుకుంటోంది.
ఇప్పటికే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో ద్వారా అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి బుల్లితెరపై సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాలను హోస్ట్ చేసినందుకుగాను నాగార్జున, చిరంజీవి భారీగా రెమ్యూనరేషన్ పుచ్చుకున్నారు.
త్వరలో 'బిగ్ బాస్' తెలుగు వెర్షన్ రియాల్టీ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్న జూ ఎన్టీఆర్..... ఇప్పటి వరకు తెలుగు బుల్లితెర రంగంలో ఎవరూ తీసుకోనంత రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు టాక్.

అందరికీ కొట్టేసాడు
రెమ్యూనరేషన్ విషయంలో జూ ఎన్టీఆర్ అందరినీ కొట్టేసారని ప్రచారం జరుగుతోంది. నాగార్జున, చిరంజీవిలు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' ద్వారా రూ. 4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని, అయితే జూ ఎన్టీఆర్ ‘బిగ్ బాస్' తెలుగు రియాల్టీ షోకు రూ. 7 కోట్ల తీసుకుంటున్నట్లు టాక్.

భారీ మొత్తం ఇదే తొలిసారి
తెలుగు బెల్లితెర రంగంలో ఒక హోస్ట్ కు రూ. 7 కోట్ల భారీ మొత్తం చెల్లించడం ఇదే తొలిసారి అని అంటున్నారు. జూ ఎన్టీఆర్ కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్, స్టార్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఇంత పెద్ద మొత్తం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్
సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా హిందీలో బాగా పాపులర్ అయిన రియాల్టీ షో 'బిగ్ బాస్' త్వరలో తెలుగులో కూడా ప్రసారం కాబోతోంది. తెలుగు వెర్షన్లో రాబోతున్న ఈ షోను టాలీవుడ్ యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్నారు.

ప్రకటించిన మా టీవీ
ఇటీవలే స్టార్ నెట్వర్క్‌లో విలీనం అయిన 'మా టీవీ' తెలుగు వెర్షన్ 'బిగ్ బాస్' ప్రసారం చేయబోతోంది. ఈ విషయమై మాటీవీ నుండి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ షో ద్వారా తొలిసారిగా జూ ఎన్టీ బుల్లితెరపై ఎంట్రీ ఇస్తుండటం హాట్ టాపిక్ అయింది.

ఎన్నో వివాదాలు
హిందీలో ప్రసారం అవుతున్న ‘బిగ్ బాస్' షోపై ఎన్నో వివాదాలున్నాయి. బిగ్ బాస్ షోలో పాల్గొనే సెలబ్రెటీల ప్రవర్తన చాలా వివాదస్పదంగా ఉండటమే అందుకు కారణం. మరి తెలుగులోనూ అదే తరహాలో వివాదాస్పదంగా ఈ షోను సాగిస్తారా? అనేది సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

టీఆర్పీ రేటింగ్సే లక్ష్యంగా...
హిందీలో బిగ్ బాస్ షోకు మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తుండటంతో తెలుగులో కూడా ఈ షోకు మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు.


Click it and Unblock the Notifications











