అల్లు అర్జున్, విక్రమ్ కుమార్ సినిమా.. ఏఆర్ రెహమాన్ రంగంలోకి!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రంలో ఫ్యాన్స్ ని నిరాశపరిచాడు. నెక్స్ట్ మూవీ కోసం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో బన్నీ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు విక్రమ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఈ చిత్ర విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. తారాగణం ఎంపిక, ఇతర ప్రాధమిక పనులు పూర్తి చేసుకున్న తరువాత ప్రకటన వెలువడే అవాకాశం ఉంది. కానీ తాజగా వస్తున్న వార్తల ప్రకారం క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది.

ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడట. హాలీవుడ్ స్థాయిలో ఉండే యాక్షన్ అంశాలు, థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ కోసం రెహమాన్ సంగీతం అయితే బావుంటుందని దర్శకుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ యాక్షన్ క్రియోగ్రాఫర్ లని కూడా రంగంలోకి దించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











