twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ నైట్ కి మెగాస్టార్ ‘చిరంజీవి’ యే టార్గెట్టా???

    By Sindhu
    |

    వరద బాధితులను ఆదుకోవటానికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ యావత్తు కలిసి నవంబర్ 7న 'స్పందన" పేరుతో స్టార్ నైట్ కార్యక్రమం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యర్రమంలో కేవలం చిరంజీవిని టార్గెట్ చేయటమే లక్ష్యంగా పావులు కదుపు తున్నారా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఈ విషయాన్నే దృవీకరిస్తున్నాయి. స్టార్ నైట్ కోసం ఏర్పాటు చేసిన తొలి సమావేశం నుంచి దీని టార్గెట్ మెగాస్టార్ చిరంజీవే అనే రీతిలో కథనాలు వినపడుతున్నాయి.

    వరద బాధితుల సహాయం కోసం ఏర్పాటు చేయాలనుకొన్న ఈ స్టార్ నైట్ గోరంత కొండతై చివరికి పరిశ్రమలో అందరివాడ్ని కొందరి వాడిగా మిగిల్చే ప్రయత్నంలా మారిపోయింది. తెర వెనుక ఎన్ని ఉన్నా పరిణామాలు మాత్రం పరిశ్రమలో చాలా కాలంగా అంతర్గతంగా జరుగుతున్న ఆధిపత్య పోరుకు కొనసాగింపులా మారిపోయింది. తెలుగు సినిమా వజ్రోత్సవంలో మొదలైన ఈర్శ్యాద్వేశాలు మరోసారి తెరమీదకు వచ్చే అవకాశం ఈ స్టార్ నైట్ లో బలంగా వినబడుతున్నాయి.

    ఇప్పటికే ఒకసారి చిరంజీవి మోహన్ బాబుల మధ్య రాజుకున్న పాత చిచ్చు దాసరి లౌక్యంగా సద్దుమణిగేలా చేసినా మరోసారి చిరంజీవి ఇబ్బంది పెట్టటం లక్ష్యంగా ఎవరి ప్రయాత్నాలు వారు చేస్తున్నారు. పరిశ్రమలో నిజంగా అందరూ బాగుండాలని కోరుకునే కొందరు ఈ పర్యవసనాలు ఎక్కడికి దారితీస్తాయోనని ఆందోళన చెందుతుంటే చిరు వైరి వర్గం మాత్రం అన్ని స్థాయిలలో చిరును అడ్డుకోవటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. గతంలో జరిగిన విషయాలను పదేపదే తవ్వితీసి చిరంజీవిని ఏదో విధంగా అవమానించాలనే ఆలోచనలో ఉన్న కొంతమందికి రాజకీయ పక్షులు కొన్ని తమ వంతు సహకారం ఇస్తున్నట్లు ఫిలిం నగర్ కోడై కూస్తుంది. దీనికి తగ్గట్టు పొత్తుల వ్యవహారం లో మరోసారి జీవిత రాజశేఖర్ దంపతులు మళ్ళీ చిరును టార్గెట్ చేసుకోవటంతో స్టార్ నైట్ మరోసారి వేడెక్కనుంది. దాసరి దౌత్యంతో పాటు చిరు తమ వంతు సహాకారం పరిశ్రమకు ఎప్పుడూ ఉంటుందని చెప్పినందున రెండో సమావేశానికి నాగబాబు వచ్చినా ఆయనకు దక్కిన గౌరవం మాత్రం శూన్యం.

    మరి ఈ ఈవెంట్ నిర్వాహక కమిటిలో చిరంజీవిని ఛీఫ్ అడ్వైజర్ గా వేసి ఆయనతో పాటు మోహన్ బాబును జయప్రదను చేర్చటం వెనుక సదుద్దేశం ఎంత ఉందో ఆ కమిటీ వేసిన వారికే తెలియాలి. ఇక ఇది చాలదన్నట్టు కాంగ్రెస్ దాసరి, తెలుగు దేశం బాలయ్య అధ్యక్ష హూదాలో, చిరంజీవి సినీ, రాజకీయ వైరి రాజశేఖర్ జనరల్ సెక్రటరీగా, మా అధ్యక్షుడు మురళీ మోహన్ లు గౌరవ ఉపాధ్యక్షులుగా సంయుక్తంగా ఈ స్టార్ నైట్ భాద్యతలు తీసుకుని చేయబోయేది చిరంజీవిని టార్గట్ చేసుకోవటమే అని ఇప్పటికే ఫిల్మ్ నగర్ కోడై కూస్తోంది.

    చిరు మాత్రం ఎప్పటిలానే హుందాగా తన సహకారం ఉంటుందని చెప్పటం మెగాస్టార్ గొప్పదనం. రాజకీయ సమీకరణలు కొంత దీనిని ప్రభావితం చేసే అవకాశం కూడా ఉండటంతో స్టార్ నైట్ సంచలనాలకు వేదిక కాబోతుందనేది మాత్రం నిజం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X