ఆ భాద్యత సాయిధరమ్ తేజ్‌కు అప్పగించిన పవన్ కళ్యాణ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు పూర్తిగా గురయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో నటించిన అజ్ఞాతవాసి చిత్రమే పవన్ కు చివరిది. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ జనసేన పార్టీని త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల సమరంలో దించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం!

కాటమరాయుడు తర్వాత
పవన్ కళ్యాణ్ కాటమరాయుడు చిత్రం విడుదల కాగానే ఏఎం రత్నం నిర్మాణంలో ఓ చిత్రాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత పవన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో నటించాల్సి రావడం, రాజకీయాల్లో బిజీ కావడంతో ఏఎం రత్నంకు ఇచ్చిన కమిట్మెంట్ పూర్తి చేయలేక పోయాడు. రత్నం పవన్ కళ్యాణ్ కు బాగా కలసి వచ్చిన నిర్మాత. వీరిద్దరి కలయికలో వచ్చిన ఖుషి చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే.

ఆ భాద్యత తేజకు
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో సినిమాల్లో నటించే పరిస్థితి లేదు. దీనితో సాయిధరమ్ తేజ్ ని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. ఏఎం రత్నం నిర్మాణంలో ఓ చిత్రంలో నటించాలని తేజకు పవన్ సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

చిత్రలహరితో బిజీగా
సాయిధరమ్ తేజ్ కెరీర్ ప్రస్తుతం ఒడిదుడుకుల్లో ఉంది. తేజ నటించిన చిత్రాలు వరుసగా నిరాశపరుస్తున్నాయి. దీనితో సాయిధరమ్ తేజ్ కొంత గ్యాప్ తీసుకుని కిషోర్ తిరుమల దర్శత్వంలో చిత్రలహరి చిత్రంలో నటిస్తున్నాడు. కళ్యాణి ప్రియదర్శన్, నివేత పెతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా సాగుతుందని అంటున్నారు.

బాగా తగ్గించారు
ఏఎం రత్నం గతంలో తరచుగా తెలుగులో చిత్రాలు నిర్మించేవారు. కానీ ఈ మధ్య ఆయన టాలీవుడ్ లో సినిమాలు బాగా తగ్గించారు. బంగారం తర్వాత మరోమారు పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవాకాశం రావడంతో వెంటనే ప్రారంభించేశారు కూడా. కానీ ఈ చిత్రం ఆగిపోయింది. రత్నం చివరగా తెలుగులో నిర్మించిన చిత్రం ఆక్సిజెన్. ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. సాయిధరమ్ తేజ్ తో తెరకెక్కించబోయే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications