భార్య పేరు కనిపించకుండా దిల్ రాజు సంచలన నిర్ణయం.. V సినిమాతో కొత్తగా
టాలీవుడ్ లో ఎంత మంది స్టార్ నిర్మాతలు ఉన్నా కూడా అందులో దిల్ రాజు స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుందనే చెప్పాలి. దర్శకులను, హీరోలను చూసే థియేటర్స్ లోకి వచ్చే ట్రెండ్ నుంచి నిర్మాత మీద నమ్మకంతో కూడా మంచి సినిమాల కోసం థియేటర్స్ కి వస్తారని దిల్ రాజు నిరూపించాడు. తన భార్య అనిత సమర్పణలోనే ఇన్ని రోజులు సినిమాలను నిర్మించి మంచి విజయాలను అందుకున్నాడు. అయితే మొదటిసారి ఆయన తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది.

రెండవ పెళ్లి తరువాత మార్పులు..
దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లోనే గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అయితే మూడేళ్ళ తరువాత మళ్ళీ పెళ్లి చేసుకున్న దిల్ రాజు నిజానికి ఒక విధంగా మంచి నిర్ణయమే తీసుకున్నాడని సొంత కూతురితో పాటు సినీ ప్రముఖులు కూడా విషెస్ అందించారు. తేజస్విని అనే ఆ అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్న తరువాత ఒక విధంగా దిల్ రాజు లైఫ్ లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.

అనిత పేరు లేకుండా..
దిల్ రాజు సినిమా అనగానే మొదటి తెరపై కనిపించేది శ్రీమతి అనిత ప్రజెంట్స్ అనే పేరు మాత్రమే. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టిన దిల్ రాజు ఆ తరువాత దిల్ సినిమా నుంచి కూడా అనిత పేరుపైనే సినిమాలు చేసుకుంటూ వచ్చాడు.
Recommended Video

దిల్ రాజు ఆలోచన ఏమిటి?
ఆరు నెలల కిందట విడుదలైన V టీజర్ లో అనిత పేరు ఉంచిన దిల్ రాజు ఇటీవల అమెజాన్ ప్రైమ్ కోసం సిద్ధం చేసిన ట్రైలర్ లో మాత్రం అనిత పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. పెళ్లి తరువాత మొదటిసారి దిల్ రాజు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు ఆలోచన ఏమిటనది చర్చలకు దారి తీస్తోంది.


Click it and Unblock the Notifications











