అక్కినేని హీరో స్పై థ్రిల్లర్.. ఆ ఒక్క విషయం వల్లే ఆలస్యం?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కథానాయకుల్లో అక్కినేని అఖిల్ ఒకరు. ఎన్ని సినిమాలు చేస్తున్నా కూడా ఈ యువ హీరో బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ అందుకోవడం లేదు. అందుకు కారణం రొటీన్ సినిమాలు చేయడమే. అఖిల్ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తేనే సక్సెస్ అందుకోగలడని చాలా మంది నుంచి కామెంట్స్ వస్తున్నాయి.
మిస్టర్ మజ్ను, హలో సినిమాలకు మొదటి సినిమా అఖిల్ కంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నప్పటికి వర్కౌట్ కాలేదు. ఇక నెక్ట్ రాబోతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఎంతవరకు సక్సెస్ అందుకుంటుందో తెలియదు. గత కొంత కాలంగా సక్సెస్ లేని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఆ సినిమాను ఎలా డిజైన్ చేస్తాడనేది ఆసక్తిగా మారింది. ఇక ఆ సినిమా తరువాత అఖిల్ సురేందర్ రెడ్డితో ఒక సినిమా చేయాలని చర్చలు జరుపుతున్నాడు.

ఆల్ మోస్ట్ కథ సెట్టయినట్లే గాని ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాలేదు. అందుకు కారణం సినిమా స్పై థ్రిల్లర్ జనర్ లో ప్లాన్ చేసుకోవడంతో బడ్జెట్ 40కోట్లకు పైగానే పెట్టాల్సి వస్తోందని నిర్మతలు కొంచెం ఆలోచిస్తున్నారట. ఎందుకంటే అఖిల్ మార్కెట్ ని బట్టి 25కోట్ల కంటే ఎక్కువ పెట్టడం రిస్క్ తో కూడుకున్న పని.
అందుకే నిర్మాతలు చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారాట. ఇద్దరు ముగ్గురు నిర్మాతలతో ఈ కాంబినేషన్ పై చర్చలు జరిపారట. ఇక అఖిల్ ఇప్పుడే రెమ్యునరేషన్ కూడా తీసుకోవద్దనే ఆలోచనలో ఉన్నప్పటికి స్టార్ ప్రొడ్యూసర్స్ డేర్ చేయకపోవడం గమనార్హం. అఖిల్ తో సినిమా చేసిన తరువాత సురేందర్ రెడ్డి పవన్ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.


Click it and Unblock the Notifications











