ప్రభాస్ కన్నా ముందు మరో టాలీవుడ్ హీరో దగ్గరకు సలార్ స్టోరీ.. ఆ భయంతోనే రిజెక్ట్!

ప్రభాస్ నటించిన సలార్ టీజర్ రానే వచ్చింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా... ఈరోజు విడుదల అయిన టీజర్ తో అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే ఈ సినిమా కథను ప్రభాస్ కంటే ముందు ఓ టాలీవుడ్ స్టార్ హీరోకు ప్రశాంత్ నీల్ వినిపించారట. అయితే ఆ హీరో రిజెక్ట్ చేయడంతోనే.. ప్రభాస్ చేతిలోకి ఈ ప్రాజెక్టు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...

ట్రెండింగ్ లో టీజర్: కేజీఎఫ్ సిరీసులతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సలార్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం 5.12 గంటలకు ఈ సినిమా టీజర్ రిలీజ్ అయి ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ లుక్ కూడా సరిగ్గా కనిపించకపోయినా... ఒక్క డైలాగ్ ప్రభాస్ చెప్పకపోయినా.. సినిమా ఎలివెషన్స్ మాత్రం ఓ రేంజులో ఉన్నాయి. అంతే కాదు ఈ సినిమాకు రవి బస్రూర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలెట్ గా నిలిచింది.

Star Telugu Hero Allu Arjun Rejected Prabhas Salaar Movie News Viral in Social Media

అంచనాలు రెట్టింపు: టీజర్ రిలీజ్ అయినప్పటీ నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఇక ఈసినిమాపై అభిమానుల్లో అంచనాలు కూడా రెట్టింపు అయ్యాయి. మరి ముఖ్యంగా కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడం... పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించడంతో... హై ఎక్స్పెక్టెషన్స్ అయితే ఏర్పడ్డాయి. అయితే ఈ టీజర్ రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఈ సినిమా కథను ముందుగా ప్రశాంత్ నీల్ ఓ స్టార్ హీరోకు వినిపిస్తే.. ఆయన రిజెక్ట్ చేశారని సమాచారం.

Star Telugu Hero Allu Arjun Rejected Prabhas Salaar Movie News Viral in Social Media

రిజెక్ట్ చేసిన హీరో: అయితే ఇలాంటి సెన్సెషనల్ డైరెక్టర్ దర్శకత్వంలో నటించాలని ఎవరైనా అనుకుంటారు. కానీ ఆ తెలుగు హీరో ఎవరూ అని ఆలోచిస్తున్నారు. పుష్ప సినిమాతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ కు మొదట ప్రశాంత్ నీల్ సలార్ కథను వినిపించారట.

అయితే బన్నీ దీనికి నో చెప్పారని సమచాారం. దానికి ఓ కారణం ఉందని తెలుస్తోంది. పుష్ప సినిమాలాగే ఇది కూడా మాస్ కంటెంట్ సినిమా కావడంతో.. బ్యాక్ టు బ్యాక్ మాస్ కంటెంట్ కథల్లో నటిస్తే.. ఇమేజ్ పోతుందనే భయంతో నో చెప్పారట. అలా బన్నీ రిజెక్ట్ చేసిన కథను ప్రభాస్ ఓకే చేశారని.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Star Telugu Hero Allu Arjun Rejected Prabhas Salaar Movie News Viral in Social Media

ఇనాయత్ ఖలీల్ కొడుకేనా: ఇక సలార్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా కేజీఎఫ్ సినిమాకు లింకప్ ఉంటుందని అంటున్నారు. కేజీఎఫ్ లోని ఇనాయత్ ఖలీల్ కొడుకే ఈ సలార్ అని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా శృతి హాసన్ నటిస్తోంది. పృథ్విరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రేయరెడ్డి తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X