NBK108: బాలయ్య సినిమాలో ఊహించని ఎపిసోడ్.. ఇప్పటి హీరోలు చేయని విధంగా!
దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన చిత్రాలను చేస్తూ.. ఆరు పదుల వయసులోనూ తనకు తానే సాటి అని నిరూపించుకుంటూ దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న ఆయన.. 'అఖండ' వంటి భారీ విజయం తర్వాత మరింత ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఆ వెంటనే 'వీర సింహా రెడ్డి'తో మరో సక్సెస్‌ను కూడా ఖాతాలో వేసుకున్నారు. ఈ జోష్‌లోనే ఇప్పుడు బాలయ్య మరో క్రేజీ మూవీతో రాబోతున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి.
హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్న నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 108వ సినిమాను స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఆలస్యంగానే ప్రారంభం అయినా.. మధ్యలో కొన్ని అనుకోని బ్రేకులు వచ్చినా.. ఇప్పుడు మాత్రం శరవేగంగానే సాగుతోంది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన చిత్రీకరణ హైదరాబాద్‌లోని ఓ ఫేమస్ స్టూడియోలో జరుగుతోంది. ఇందులో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ న్యూస్ తెగ వైరల్ అయిపోతోంది.
స్టార్ డైరెక్టర్.. స్టార్ హీరో కలయికలో రూపొందుతోన్న ఈ చిత్రంలో బాలయ్య అభిమానులు పండుగ చేసుకునే ఎన్నో ట్రీట్లు ఉంటాయని అనిల్ రావిపూడి ముందే చెప్పాడు. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో బాలకృష్ణ ఓ కర్ర ఫైట్‌ను చేయబోతున్నారట.

వెంకట్ అనే యాక్షన్ కొరియోగ్రాఫర్ ఈ సీక్వెన్స్‌ను కంపోజ్ చేశారని తెలిసింది. గతంతో 'మంగమ్మ గారి మనవడు' టైంలో బాలయ్య చేసిన కర్ర ఫైట్‌ను గుర్తు చేసేలా ఇది ఉంటుందని, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో వచ్చే ఈ సీక్వెన్స్ హైలైట్‌గా నిలుస్తుందని తెలిసింది. దీంతో మూవీపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.
బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తీస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. యంగ్ సెన్సేషన్ శ్రీలీల కూతురిగా చేస్తున్నారు. దీనికి థమన్ సంగీతాన్ని ఇస్తున్నాడు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. దీన్ని దసరాకు విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు.


Click it and Unblock the Notifications











