అపుడు షాకిచ్చిన పవన్: బాలయ్య స్నేహం కోసం ఇపుడు?
హైదరాబాద్: ఈ మధ్య పవన్ కళ్యాణ్ విషయంలో కొన్ని ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అప్పట్లో ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు పలుకుతున్నారనే వార్తలు వినిపించాయి. తొలుత అంతా ఈ విషయాన్ని వట్టి పుకారే అనుకున్నారు. అన్నయ్య అభిమతానికి భిన్నంగా తమ్ముడు వెళ్లే అవకావం లేదని మెగా ఫ్యాన్స్ సైతం ఈ విషయం నమ్మలేదు. కానీ అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ, ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేస్తూ అసలు జరిగింది వేరు. అన్నయ్యకు వ్యతిరేకంగా పార్టీ పెడతారనే వార్తలు వచ్చినా ఎవరూ నమ్మలేదు. కానీ తర్వాత జరిగింది వేరు.
ఇపుడు ఇలాంటి విషయమే మరొకటి చోటు చేసుకోబోతోందా? అంటే అవుననే అంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు. త్వరలో నందమూరి నటసింహం బాలయ్య, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో మల్టీ స్టారర్ సినిమా రాబోతోందని అంటున్నారు. బాలకృష్ణ 100వ సినిమా విషయంలో ఇది నిజం కాబోతోందట. గతంలో పవన్ ఇచ్చిన షాక్ లు రుచి చూసిన వారు ఇది నమ్మాల్సిందే

బాలయ్య తన 100 సినిమా స్పెషల్ గా ఉండాలని కోరుకుంటున్నారు. చరిత్ర సృష్టించే విధంగా ఈ సినిమా ఉండాలని ఆయన ఆరాట పడుతున్నారు. బాలయ్యకు కెరీయర్ హిట్స్ ఇచ్చిన బోయపాటే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అతిధి పాత్రలో నటించేలా ఒప్పించారట.
బాలయ్య స్నేహం కోసం పవన్ కళ్యాణ్ ఈ విషయం ఒప్పుకున్నారని, బాలయ్య కూడా ఈ విషయమై ఆసక్తి చూపుతున్నాని అంటున్నారు. పవన్‌కు అత్యంత సన్నిహితుడు పీవీపీ అధినేత పోట్లూరి వర ప్రసాద్ ఈసినిమాను నిర్మించనున్నారని టాక్. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











