‘అహం బ్రహ్మాస్మి’ వెనుక పెద్ద కథే ఉంది.. అడిగిన వెంటనే ఇచ్చేసిన డైరెక్టర్

మంచు మనోజ్ చాలా కాలం తరువాత కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. వ్యక్తిగతం జీవితంలోని ఒడిదుడుకులను దాటుకుని కొన్ని రోజులు ప్రశాంతంగా గడిపేశాడు. ఆ మధ్య ఊర్లు పట్టుకుని తిరగడం, సంక్రాంతికి కుటుంబంతో గడపడం ఇలా ఆనందంగానే ఉన్నాడు. ఇక తనకు తెలిసిందే సినిమానేనని, మళ్లీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తానని ఆ మధ్య ప్రకటించాడు. కాస్త ఆలస్యమే అయినా.. చెప్పినట్టుగా కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్‌డేట్ అయితే ఇచ్చేశాడు.

వ్యక్తిగత జీవితంలో సమస్యలు

వ్యక్తిగత జీవితంలో సమస్యలు

మంచు మనోజ్, తన భార్య ప్రణతితో విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. విడాకులతో తన వివాహ బంధం ముగుస్తోందని ఎమోషనల్‌ పోస్ట్ చేశాడు. ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు తలెత్తడంతోనే విడిపోవలసి వస్తుందని.. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి గౌరవం ఉన్నా కలిసి జీవించలేమని రాసుకొచ్చాడు.

Recommended Video

Manchu Manoj Is Back In To Movies,Writes An Emotional Post | Aham Brahmasmi

మళ్లీ ఎమోషనల్..

పర్సనల్ లైఫ్‌లో జరిగిన విషయాలను పక్కనపెట్టి తన సినీ కెరీర్‌పై దృష్టి పెట్టాడు. ‘మూడేళ్ల తర్వాత మీ ముందుకు వస్తున్నాను. నా తొలి సినిమా ‘దొంగ దొంగది' సమయంలో ఎలాంటి ఎమోషన్‌కు లోనయ్యానో ఇప్పుడు కూడా అలాగే ఫీల్‌ అవుతున్నాను. నా జీవితమైన నా కళను మిస్సయ్యాను. ఇన్నిరోజులు నా ఆఫ్ స్క్రీన్ జర్నీని కూడా సపోర్ట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. సినీ అమ్మ వచ్చేశా. లవ్‌ యూ డార్లింగ్స్‌' అని మనోజ్‌ తన కొత్త ప్రాజెక్ట్ విషయాలు ప్రకటించాడు.

అహం బ్రహ్మాస్మి..

అహం బ్రహ్మాస్మి..

మంచు మనోజ్ సొంత నిర్మాణ సంస్థ అయిన ఎమ్ఎమ్ ఆర్ట్స్‌పై తల్లి నిర్మలాదేవీతో కలిసి స్వయంగా నిర్మిస్తున్నాడు. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ ఇలా ప్యాన్ ఇండియాగా తెరకెక్కిస్తున్న ‘అహం బ్రహ్మాస్కి' సినిమాకు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని మార్చ్ 6న ప్రారంభించబోతోన్నట్లు ప్రకటించారు.

టైటిల్ వెనుక పెద్ద కథే..

టైటిల్ వెనుక పెద్ద కథే..

అయితే ఈ టైటిల్ వెనుక పెద్ద కథే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ టైటిల్‌ను క్రిష్ అప్పట్లోనే రిజిస్టర్ చేయించుకున్నాడని, బన్నీ-రానా వంటి వారితో మల్టీ స్టారర్ చేద్దామని ఫిక్స్ అయినట్టు వార్తలు వచ్చాయి. ఏమైందో ఏమోగానీ ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. అయితే తన సినిమాకు ఈ టైటిల్ సరిపోతుందని క్రిష్‌ను మనోజ్ అడిగిన వెంటనే ఇచ్చేశాడని తెలుస్తోంది. వేదం సినిమాలో మంచు మనోజ్ చేయడం, అప్పటి స్నేహం, చనువుతోనే ఇచ్చేశాడని టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X