ఎన్టీఆర్ ప్రధానమంత్రి అవటమే... 'దూకుడు' కథ
మహేష్ తాజా చిత్రం దూకుడులో ప్రకాష్ రాజ్ అతని తండ్రిగా కనిపిస్తాడు. అతను సీనియ ర్ ఎన్టీఆర్ కి వీర ఫ్యాన్. మహేష్ ఇంట్రడక్షన్ పంచ్ డైలాగులతో ఫైట్ తో మొదలవుతుంది. అతను పోలీస్ ఆఫీసర్ గా చేస్తూంటాడు. అతని బాస్ నా్ర్. ఇక నీ దూకుట పాట, పైట్ అయ్యాక...మహేష్ టర్కీకి వెళ్ళతాడు. అక్కడ సమంతతో ప్రేమలో పడతాడు. గురువారం పాట వస్తుంది. అక్కడ ఆపరేషన్ పూర్తి చేసుకుని ఇండియాకు వస్తాడు. అప్పుడు ప్రకాష్ రాజ్ దాదాపు 14 సంవత్సరాల కోమానుంచి బయిటకు వస్తాడు. బ్రహ్మానందం ఎంట్రీ కామిడీ బావుంటుంది. అప్పుడు మహేష్ అతనికి ఎన్టీఆర్ ప్రధానమంత్రి అయ్యాడని చెప్పి, తాను ఎమ్మల్యేని అయ్యానని నాటకం మొదలెడతాడు.
ప్రకాష్ రాజ్ ఆరోగ్యం కోసం ఆయనకు ఏదీ హఠాత్తుగా చెప్పకూడదని, ఆయన మనస్సులో ఏదైతే కోరుకున్నాడో అదే జరుగుతున్నట్లు నాటకం ఆడతాడు. అక్కడ నుంచి బ్రహ్మానందం, మహేష్ ల మధ్య కామిడీ మొదలవుతుంది. చులిబులి సాంగ్ వస్తుంది. సోనూ(వినాయకుడు ఫేమ్) ఎంట్రీ.. ఓ కీలకమైన మలుపుతో ఇంట్రవెల్. సెకండాఫ్ విషయానికి వస్తే.. ప్రకాష్ రాజ్ కీ సోనూకి మద్య ప్లాష్ బ్యాక్. ఎందుకు కోమాలోకి వెళ్లిపోయాడో తెలియటం. ఎమ్ ఎస్ నాయారణ ఎంట్రీ, మగధీరను ప్యారెడీ చేస్తాడు. ఇక పార్వతీ మిల్టన్ ఐటమ్ సాంగ్ పూవై వస్తుంది. సింహా, యమదొంగ, మగధీరల స్పూఫ్ కామిడీ వస్తుంది. ఎమ్.ఎస్, బ్రహ్మానందం మధ్య కామిడీ వస్తుంది. చివరి పాట. క్లైమాక్స్ ట్విస్ట్. సినిమా శుభం. ఇక సినిమాలో పంచ్ డైలాగులే హైలెట్ గా నిలుస్తాయి. సమంత ఇంతకుముందు కన్నా అందంగా కనిపించింది. సమంత, మహేష్ ల మధ్య వచ్చే టీజింగ్ సీన్స్ బాగా పండాయి. శ్రీను వైట్ల మార్కు కామిడీకి బాగా రెస్పాన్స్ వస్తోంది. మహేష్ యాక్షన్ సీక్వెన్స్ లను బాగా డిజైన్ చేసారు.


Click it and Unblock the Notifications











