'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కథ ఇదా?
మహేష్, వెంకటేష్ కాంబినేషన్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కథ అంటూ ఓ ఉప్మా స్టోరీ ప్రచారంలోకి వస్తోంది. ఆ కథ ప్రకారం..ప్రకాష్ రాజ్, జయసుధ భార్యా భర్తలు. వాళ్ల పెద్ద కుమారుడు వెంకటేష్, రెండవ కుమారుడు మహేష్. వారికి శ్వేతా బసు అనే చెల్లెలు ఉంటుంది. వెంకటేష్ ఓ వ్యవహారంలో మోసపోయి ఆస్తి మొత్తం పోగొట్టుకుంటాడు. దాంతో అప్పటికే కుదిరిన శ్వేతాబసు పెళ్లి ఆగిపోతుంది. కుటుంబం చిన్నా భిన్నం అయిపోతుంది. ఇంట్లో గొడవలు వస్తాయి.
ఈ నేపధ్యంలో సెకండాఫ్ లో వచ్చిన మహేష్ బాబు..ఆ కుటుంబ భాధ్యతలు అన్నీ భుజాన వేసుకుని బ్రహ్మానందం సహాయంతో ఆ ఆర్ధిక భాదలనుంచి బయిటపడేసి కుటంబాన్ని ఎలా నిలబెట్టాడనేది కధ. ఈ కథ చదివిన వారు ఎవరికైనా స్టార్ కాస్ట్ ని చూసుకుని అప్పిటికప్పుడు అల్లేసిన కథ అనే విషయం అర్ధమవుతుంది. ఈ చిత్రం గురించి దిల్ రాజు మాట్లాడుతూ ''25 సంవత్సరాల తర్వాత వస్తున్న మల్టీస్టారర్ ఇది. వెంకీ, మహేష్ అన్నదమ్ము లుగా నటిస్తున్నారు. సీతమ్మ వాకిలి.. అంటే భారతదేశం, సిరిమల్లె చెట్టు..అంటే కుటుంబం. టైటిల్ మంచి ఫీల్‌నిచ్చింది.
మే నెలాఖరుకి సినిమా పూర్తిచేసి..అదే నెలలో విడుదల చేస్తాం అన్నారు. దసరా రోజు పూజ చేసి లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ లో వెంకటేష్, ప్రకాష్ రాజ్ ఇద్దరూ షూటింగ్ లో పాల్గొంటారు. సహనిర్మాతలు: శిరీష్- లక్ష్మణ్, కథ- కథనం-మాటలు-దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.


Click it and Unblock the Notifications











