ఆసియా దేశాలు గుర్తించటం కష్టం తర్వాత ఉన్న సుఖమే:రజనీకాంత్
అతి సామాన్యుడు ఒకేసారి అందలం ఎక్కడం కథల్లో, సినిమాల్లో చూస్తుంటాం. నిజానికి అది రియల్ గా అసాధ్యం అయితే కొండంత ప్రయత్నం చేస్తే కొంతయినా విజయం దక్కుతుంది అంటున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. శివాజీ రావ్ గైక్వాడ్ గా ఓ సామాన్య కుటుంబంలో పుట్టి, బ్రతుకు తెరువు కోసం 1978లో కండక్టర్ ఉద్యోగం చేస్తుండగా బాలచందర్ దృష్టిని ఆకర్షించి ఇవ్వాళ దక్షిణాదిలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నాడు.
ప్రస్తుతం ఆయన రోబో షూటింగ్ లో బిజిగా ఉండటం తెలిసిందే. ఈ 'రోబో" సినిమా కూడా 'అవతార్ సినిమాలాంటి అనుభాతే కలిగిస్తుందనీ, నన్ను జపాన్ లాంటి ఆసియా దేశాల్లో గుర్తించటం భగవంతుడి కప అనీ, అలాగే ఒక పూట తిని, కుళాయి నీళ్లు తాగి వీధుల్లో చెట్ల క్రింద పడుకునీ, ప్రయత్నాలు చేయడం వల్లే తానీ స్థితికి చేరుకో గలిగాను, ఇలా బ్రతికిన నాకు కష్టం విలువ బాగా తెలుసు, కష్టం పడకుండా ఏ రంగంలోనూ ఎదగలేరని రజినీకాంత్ చెబుతున్నాడు.


Click it and Unblock the Notifications











