ఎన్టీఆర్ మీసమే..ప్లాబ్లం అయ్యిందంటూ రూమర్
హైదరాబాద్ : ఎన్టీఆర్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. హరీశ్ శంకర్ దర్శకుడు. ఎన్టీఆర్ సరసన సమంత, శ్రుతి హాసన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం గురించి విచిత్రమైన రూమర్ ప్రచారమవుతోంది.
ఆ రూమర్ ఏమిటంటే..ఎన్టీఆర్ ...తన మీసం షేవ్ చేసేసుకోవటం వల్ల..షూటింగ్ ఆగిపోయిందని చెప్పుకుంటున్నారు. కంటిన్యుటి ప్లాబ్లంల వల్ల ఆ మీసం పెరుగుదల కోసం వెయిట్ చేస్తున్నారని, అందుకోసం షూటింగ్ ఆపిచేసారని అంటున్నారు. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ లో కొన్ని మళ్లీ రీషూట్ చేస్తున్నారని కూడా రూమర్ క్రియేట్ అయ్యింది.
భాద్‌షా' తర్వాత ఎన్టీఆర్, 'గబ్బర్‌సింగ్' తర్వాత హరీశ్ శంకర్ చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు అంబరాన్నంటుతున్నాయి. టైటిల్‌కు అన్ని వర్గాల నుంచీ మంచి స్పందన వచ్చిందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పంచ్ డైలాగ్స్, ఆయన ఎమోషనల్ కేరక్టర్ హైలైట్‌గా నిలుస్తాయని హరీశ్ శంకర్ చెప్పారు.
హరీష్ శంకర్ మాట్లాడుతూ...''ఎన్టీఆర్ సినిమాల్లో 'ఆది', 'సింహాద్రి' నా ఆల్‌టైమ్ ఫేవరేట్ సినిమాలు. 'రామయ్యా వస్తావయ్యా' వాటి సరసన నిలుస్తుందని ఆశిస్తున్నా'' అని అన్నారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ ...స్టూడెంట్ లీడర్ గా ఓ రేంజిలో ఫన్,ఎమోషన్ కలిగిపిన పాత్రలో అలరిస్తాడని చెప్తున్నారు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ విద్యార్థి నాయకుడిగా కనిపిస్తున్నట్టు సమాచారం. సమంత, శ్రుతిహాసన్ హీరోయిన్స్ . హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు.ఆగస్టు రెండోవారంలో ఈ సినిమాలోని పాటల్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












