చైతూకు నాగార్జున బ్రెయిన్ వాష్!
మొన్న దడ సినిమా...నేడు బెజవాడ సినిమా. రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో....తన కొడుకు కెరియర్ ఏమౌతుందో? అని బెంగ పెట్టుకున్న నాగార్జున, పరిస్థితిలో మార్పురావాలి అంటే చైతన్యలో మార్పు రావాలని యోచిస్తున్నాడట. ఇందులో భాగంగా చైతన్యకు రెండు కోజుల క్రితం క్లాస్ పీకి బ్రెయిన్ వాష్ చేసినట్లు సమాచారం.
ఈ రెండు అపజయాలకు మూలం నాగ చైతన్యే అని నాగ్ భావిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. వాస్తవానికి ఈ రెండు సినిమాలు నాగార్జున ఇష్ట పూర్వకంగా ఒప్పుకోలేదు. చైతన్య ఒత్తిడి మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. దడ సినిమా రూపొందించిన దర్శకుడు అజయ్ భూయాన్ కు ఇది వరకు ఎప్పుడూ దర్శకత్వంలో అనుభవం లేక పోయినా కేవలం నాగచైతన్య సిఫార్సు చేయడంతో ఒప్పుకున్నాడని అంటున్నారు.
అదే విధంగా బెజవాడ సినిమా విషయంలోనూ నేనే స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటానని నాగచైతన్య బెట్టు చేయడంతో....నాగ్ ఒకే చెప్పాడని అంటున్నారు. తీరా అంతా అయిపోయాక చూస్తే వరుసగా రెండు ప్లాపులు. పరిస్థితి ఇలానే కొనసాగితే కొడుకు భవిష్యత్ పాడవుతుందని మదన పడుతున్న నాగార్జున చైతన్యలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడట. మరి వరుస ప్లాపుల బాటలో నడుస్తున్న చైతన్య కెరీర్ ను నాగార్జున ఎలా గాడిలో పెడతాడో? ఏమో?


Click it and Unblock the Notifications











