Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మెగా ఫ్యాన్స్‌కు పండగే, గోన గన్నారెడ్డిని మించేలా.. సైరాలో అల్లు అర్జున్!
Recommended Video
ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ చిత్రాలు రూపొందుతున్నాయి. ఓ వైపు బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ రూపొందిస్తుంటే, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డితో బిజీగా ఉన్నాడు. స్వాతంత్ర సమరయోధుడు, తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. హాలీవుడ్ స్టార్ యాక్షన్ సన్నివేశాలతో సైరా చిత్రాన్ని ముస్తాబు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి అదిరిపోయే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
సైరాలో స్టైలిష్ స్టార్
సైరా చిత్రంలో ఇప్పటికే పలువురు స్టార్ నటీనటులు నటిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నుంచి తమిళ నటుడు విజయ్ సేతుపతి వరకు చాలా మంది ప్రముఖులు ఈ చిత్రంలో భాగం కానున్నారు. తాజగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ కూడా గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మెగా ఫ్యాన్స్ కు పండగే
చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రంలో చిరు, బన్నీ ఇద్దరూ కనిపిస్తే మెగా ఫ్యాన్స్ కు ఇంతకంటే ఇంకే కావాలి. ఈ వార్త ప్రచారం జరుగుతున్నప్పటినుంచి ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా ఉన్నాయి. కానీ చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
బన్నీ చేతిలో పడితే
ఎలాంటి పాత్రనైనా తన ఎనర్జీతో బన్నీ మరో లెవల్ కు తీసుకుని వెళ్లగల నటుడు. గతంలో రుద్రమదేవి చిత్రంలో బన్నీ గోన గన్నారెడ్డి పాత్రలో విశ్వరూపం ప్రదర్శించాడు. బన్నీ చెప్పే డైలాగులు ఆ చిత్రంలో హైలైట్ గా నిలిచాయి.
మెగాస్టార్ కోసం
ఒకవేళ నిజంగానే సైరా చిత్రంలో బన్నీ కోసం ఓ పాత్ర ఉంటె అల్లు అర్జున్ 100 శాతం తన సత్తా చూపిస్తాడని అనడంలో సందేహం లేదు. బన్నీ చెప్పే పవర్ ఫుల్ డైలాగులు చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రాలకు బాగా సరిపోతాయి.
అతిథి పాత్రల్లో
గతంలో అల్లు అర్జున్ ఎవడు, రుద్రమ దేవి, శంకర్ వంటి చిత్రాల్లో అతిధి పాత్రల్లో నటించాడు. ఇప్పటికే సైరా చిత్రంపై భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక బన్నీ ఈ చిత్రంలో నటిస్తున్నాడని అధికారికంగా ప్రకటిస్తే ఆ అంచనాలు మరో స్థాయికి వెళతాయి.