»   » సుచీ లీక్స్ సుచిత్ర కిడ్నాప్ అయిందా?

సుచీ లీక్స్ సుచిత్ర కిడ్నాప్ అయిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కొన్ని రోజుల క్రితం సుచీ లీక్స్ వ్యవహారం సౌత్ సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. సింగర్ సుచిత్ర పేరు మీద జరిగిన ఈ లీక్స్ వ్యవహారంలో ధనుష్, అనిరుధ్, ఆండ్రియా, చిన్మయి, హన్సిక, త్రిష, రానా, సంచిత శెట్టి వంటి టాప్ స్టార్ల ప్రైవేట్ ఫోటోస్ లీక్ అయ్యాయి.

ఫోటోలతో పాటు పలువురు స్టార్లకు సంబంధించిన సెన్షేషన్ విషయాలు, షాకింగ్ సీక్రెట్లు సుచీ లీక్స్ ద్వారా బయట పడటంతో యావత్ సినీ లోకం విస్తుపోయింది. తనకు మత్తు మందు ఇచ్చి ధనుష్, అనిరుధ్ సెక్స్ చేశారని, సింగర్ చిన్మయి పెళ్లికి ముందే అనేక సార్లు అబార్షన్ చేయించుకుంది... అంటూ సింగర్ సుచిత్ర సుచి లీక్స్ ద్వారా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

సుచిత్ర కిడ్నాప్

సుచిత్ర కిడ్నాప్

త్వరలో మరిన్ని సెన్సేషన్ విషయాలు, వీడియోలు, ఫోటోలు బయట పెడతానని సుచిత్ర హెచ్చరించింది. అయితే ఇంతలోనే సుచిత్ర ఎవరికీ కనపడకుండా పోవడంతో ఆమె కిడ్నాప్ కు గురైనట్లు ప్రచారం జరుగుతోంది.

అందుకే అంతా సైలెంట్

అందుకే అంతా సైలెంట్

కొన్ని రోజులుగా సుచీ లీక్స్ కు సంబంధించిన అప్ డేట్స్ ఏమీ లేక పోవడానికి కారణం.... ఆమె కిడ్నాప్ కు గురి కావడమే అని, తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులే ఆమెను కిడ్నాప్ చేసారనే ప్రచారం జరుగుతోంది. కొందరేమో సుచిత్ర విదేశాలకు వెళ్లిందని అంటున్నారు.

 హ్యాకింగ్ నిజమేనా?

హ్యాకింగ్ నిజమేనా?

కాగా ఈ లీక్స్ వెనక తన ప్రమేయం లేదని, తన అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేసారని సుచిత్ర ఆ మధ్య పోలీసులకు కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కావాలనే సుచిత్ర ఇలా కంప్లైంట్ చేసి.... లీకుల పర్వం కొనసాగించిందనే ఆరోపణలు సైతం ఉన్నాయి.

ఆమె మానసిక సమస్య ఉందా?

ఆమె మానసిక సమస్య ఉందా?

సుచిత్ర మానసిక సమస్యతో బాధ పడుతుందని....ఆమె మీడియాతో మాట్లాడటానికి సిద్ధంగా లేదని కొన్ని రోజుల క్రితం ఆమె భర్త కార్తీక్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆమె మానసిక స్థితి బాగానే ఉందని... ధనుష్, అనిరుధ్ తనపై దాడి చేయడంతో వారిపై పగ తీర్చుకోవాలనే ఆమె ఇదంతా చేస్తుందని మరికొందరి వాదన.

ఎవరూ నోరు విప్పలేదు

ఎవరూ నోరు విప్పలేదు

అయితే ఈ లీక్స్ వ్యవహారంలో పలువురు స్టార్స్ పేరు బయటకు వచ్చినా ఎవరూ ఇంత వరకు నోరు విప్పలేదు. ఈ విషయమై పోలీసులకు కూడా కంప్లైంట్ చేయలేదు. ఆ లీకుల్లో నిజం ఉండబట్టే ఎవరూ నోరు విప్పడం లేదని ప్రచారం కూడా ఉంది.

ఏది నిజం? ఏది అబద్దం?

ఏది నిజం? ఏది అబద్దం?

సుచి లీక్స్ వ్యవహారంలో ఏది నిజమో? ఏది అబద్దమో తెలియక సినీ అభిమానులు అయోమయంలో ఉన్నారు. ఈ పరిణామాల క్రమంలో ఇపుడు సుచి లీక్స్ సుచిత్ర కిడ్నాప్ జరిగిందనే ప్రచారంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్లయింది.

English summary
Two weeks ago, Controversial & Private pictures and videos were leaked from Singer Suchitra’s Twitter Account. Speculators suggest a possibility of someone related to this MMS scandal on kidnapping her or blackmailing her not to disclose more private pictures of celebrities.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu