For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విడాకుల కేసులో సుదీప్‌కు మొట్టికాయలు తప్పవా?.. నిత్యా మీనన్ కారణమా..

  By Rajababu
  |

  కన్నడ సూపర్ స్టార్ కిచ్చ సుదీప్, భార్య ప్రియ వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తడంతో వారు వేర్వేరుగా ఉంటున్నారనేది పాత సమాచారమే. సుదీప్, ప్రియ విడిపోవడానికి నిర్ణయించుకొని విడాకుల కోసం కర్ణాటకలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో సుదీప్ దంపతులు కొద్దికాలంగా కోర్టు విచారణకు హాజరుకావడం లేదనిది తాజా సమాచారం. దీంతో వారి వైవాహిక జీవితం మళ్లీ గాడిలో పడనున్నాదా లేక విడాకులకే ప్రయత్నిస్తున్నారా అనే విషయం చర్చనీయాంశమైంది.

  తొమ్మిదోసారి గైర్హాజరు

  తొమ్మిదోసారి గైర్హాజరు

  వాస్తవానికి ఈ కేసులో జూన్ 14న సుదీప్ దంపతులు కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా వారు రాలేదని తెలిసింది. కోర్టు విచారణకు హాజరుకాకపోవడం ఇది తొమ్మిదోసారి అని తెలిసింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ నిమిత్తం సుదీప్ బ్యాంకాక్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది. కోర్టు హాజరుకాకపోవడంపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. సుదీప్ దంపతులకు ఓ కూతురు కూడా ఉంది.

  విభేదాలు సద్దుమణిగాయా?

  విభేదాలు సద్దుమణిగాయా?

  ఫ్యామిలీ కోర్టుకు హాజరుకాకపోవడంతో వారి వైవాహిక జీవితంలో విబేధాలు పరిష్కారం అయ్యాయా? సమస్యలను సర్దుబాటు చేసుకొన్నారా అనే ప్రశ్నలు లేస్తున్నాయి. సుదీప్, ప్రియ మధ్య విభేదాలు తొలగిపోయాయి. వారిద్దరూ మళ్లీ కలువనున్నారనే వార్తను ఓ జాతీయ వార్తా వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించింది.

  తీవ్రంగా పరిగణిస్తున్న కోర్టు

  తీవ్రంగా పరిగణిస్తున్న కోర్టు

  కాగా సుదీప్, ప్రియ కేసు విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో వారు కోర్టు ముందుకు రావడానికి చివరి అవకాశాన్ని ఇచ్చినట్టు సమాచారం. ఒకవేళ వారు కోర్టుకు హాజరుకాకపోతే విడాకుల కేసులో కోర్టు స్వయంగా తీర్పు వెల్లడించడానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తున్నది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే ట్రిబ్యునల్ ఎలాంటి తీర్పు ఇస్తుందోననే అంశంపై ఆసక్తి నెలకొన్నది.

  నిత్యామీనన్‌తో అఫైర్ కారణమా?

  నిత్యామీనన్‌తో అఫైర్ కారణమా?

  సుదీప్, ఆయన భార్య ప్రియ మధ్య విభేదాల కారణం నటి నిత్యా మీనన్ అనే మాట బలంగా వినిపిస్తున్నది. నిత్యా మీనన్‌తో ఉన్న అఫైర్ కారణంగా సుదీప్ దంపతుల మధ్య కలతలు చోటుచేసుకొన్నాయని, అవి విడాకుల వరకు దారి తీసాయని పలు కన్నడ పత్రికలు కథనాలు ప్రచురించాయి. విడాకుల కేసు ఓ పక్క కొనసాగుతుండగా, మరో వైపు నిత్యతో అఫైర్ జోరుగా సాగుతున్నదనే రూమర్ ప్రచారంలో ఉంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ద్విభాషా చిత్రం ముదింజ ఇవాన పుడిలో సుదీప్, నిత్య హీరో హీరోయిన్లు. ఈ చిత్రం కన్నడ, తమిళ భాషల్లో విడుదల కానున్నది.

  అందరికీ సమస్యలుంటాయి.

  అందరికీ సమస్యలుంటాయి.

  భార్యతో విడాకులు, అఫైర్ తదితర అంశాలపై స్పందించాలని మీడియా కోరగా ఇటీవల సుదీప్‌ నిరాకరించారు. వ్యక్తిగత సమస్యలను ప్రస్తావించవద్దు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో సమస్య ఉంటుంది. దాన్ని వివాదంగా మార్చకూడదు అని ఆయన అన్నారు. అయితే విడాకులు ఇవ్వడానికి దాదాపు రూ.19 కోట్లు చెల్లించడానికి సుదీప్ సిద్ధపడినట్టు కన్నడ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి.

  English summary
  Speculations about the marital status between Sandalwood star Sudeep and his wife Priya has been a big topic of discussion. The latest was that the couple failed to show up at the court on Wednesday, June 14 for a hearing. Now, sources at the court say that this is the 9th consecutive time they have failed to appear in the court. Kannada Industry is buzzing with gossip of Sudeep’s alleged affair with a Kannada actress Nithya Menen. Well, now that’s a bit shocking to hear the divorce scenario and the alleged affair are running parallel.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X