రాజమౌళి తాజా చిత్రం 'ఈగ' లో విలన్ ఎవరంటే...
ఈగ ప్రధాన పాత్రలో యానిమేషన్స్ ఉపయోగిస్తూ రాజమౌళి రూపొందించనున్న ఈగ చిత్రంలో విలన్ గా కన్నడ నటుడు సుదీప్ ఎన్నికయ్యారు. సుదీప్ రీసెంట్ గా రక్త చరిత్రలో నటించారు. రామ్ గోపాల్ వర్మ ఫూంక్, రన్ చిత్రాల ధ్వారా సుదీప్ పాపులర్ అయ్యారు. ఇక ఈ ఈగ చిత్రం యానిమేషన్ తో పాటు లైవ్ యాక్షన్ తో ఉండనుంది. స్క్రిప్టు వర్క్ పూర్తయి షూటింగ్ కు సిద్దమవుతోంది. రన్ లో సుదీప్ నటన చూసి ఇంప్రెస్ అయిన రాజమౌళి ఇతన్ని స్టైయిట్ గా తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు. ఇక హీరోగా అష్టాచెమ్మ నానిని తీసుకుంటున్నారని వినపడుతోంది. ఇక ఈ చిత్రం పూర్తి చేసి ప్రభాస్ చిత్రానికి రాజమౌళి రెడీ అవటానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలో 'ఈగ' మాత్రమే గ్రాఫిక్స్ అనీ మిగతా పాత్రల్లో మనుష్యులు ఉండనున్నారు. కథ మొత్తం 'ఈగ' పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతుంది. ఇక మొదటి నుంచి అడపా దడపా చిత్రాల్లో గ్రాఫిక్స్ ని వాడుతున్నా పూర్తి స్ధాయిలో గ్రాఫిక్స్ ఉపయోగించిన మగధీర సంచలన విజయం సాధించటంతో గ్రాఫిక్స్ పై మరింత మక్కువ పెంచుకుని రాజమౌళి ఈ చిత్రం ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











