'లింగా': రూమర్ కాదు నిజమేనట

By Srikanya

బెంగళూరు: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న 'లింగా' సినిమాలో రాజమౌళి చిత్రం ఈగ లో విలన్ గా చేసిన సుదీప్ నటిస్తున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడది నిజమే అని కన్నడ చిత్ర పరిశ్రమ అంటోంది. సినిమా క్లైమాక్స్ లో సుదీప్, రజనీ కు మధ్య కీలకమైన సన్నివేశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.

ఇక గతంలో....ఇదే విషయమై తాను నటించేందుకు నిరాకరించానంటూ కొనసాగుతున్న ప్రచారాన్ని నటుడు సుదీప్‌ తోసిపుచ్చారు. అదొట్టి గాలివార్తగా కొట్టేశారు. లింగా సినిమాలో విలన్ గా నటించాలని కోరగా తాను నిరాకరించానంటూ సోషల్‌ మీడియాలో వదంతులు షికార్లు చేశాయి. రజనీకాంత్‌ సినిమాలో నటించే అవకాశం వస్తే ఎవరు వద్దంటారని ఆయన అన్నారు. అలాంటి ప్రస్తావనే రాలేదని స్పష్టం చేశారు.

'లింగా' లేటెస్ట్ అప్ డేట్స్

కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం 'లింగా'. ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువ భాగం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో జరిగింది. క్లెమాక్స్‌ సన్నివేశాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ క్లైమాక్స్ నిమిత్రం అక్షరాలా మూడు కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. ఆగస్టు 15 నుంచీ క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. హై ఓల్టేజ్ క్లైమాక్స్ ఇదని, రజనీ కెరీర్ లో అద్బుతంగా మిగిలేలా చిత్రీకరించాలని దర్శక,నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.

Sudeep’s cameo in Lingaa

సాధారణంగా అన్ని కథలు ఆఖరుకు కంచికి చేరుతాయి. కానీ 'లింగా' చిత్ర క్లెమాక్స్‌ కర్ణాటకు చేరింది. ఆఖరి సన్నివేశాలన్నీ అక్కడే చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్‌లో చిత్రీకరణ అయ్యాక.. చెన్నైలో కొన్ని రోజులు చిత్రీకరించి.. ప్రస్తుతం కర్ణాటకకు వెళ్లింది. మైసూర్‌, బెంగళూరు, కావేరి నది సరిహద్దు ప్రాంతాల్లో పలు సన్నివేశాలు చిత్రీకరించాలని చిత్ర యూనిట్‌ నిర్ణయించింది.

ప్రస్తుతం బెంగళూరులో చిత్రీకరణ ప్రారంభమైనట్లు సమాచారం. అక్కడ మళ్లీ డ్యాంసెట్‌ వేయాలనుకొంటున్నట్లు సమాచారం. దీంతోపాటు భారీ ఎత్తున శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారట. ఈ ప్రాంతంలో ఓ పాటను చిత్రీకరించనున్నారు. వీలైంనత వరకు ఈ నెలాఖరు లేదా వచ్చేనెల ప్రథమార్థంలోపు చిత్రీకరణ పూర్తి చేయాలని భావిస్తోంది యూనిట్‌. రజనీకాంత్‌ పుట్టినరోజు సందర్భంగా డిసెంబరులో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. క్లెమాక్స్‌ సన్నివేశాల్లో సోనాక్షిసిన్హాపై సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

రజనీకాంత్‌ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం 'లింగా' . కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్కతో పాటు సోనాక్షి సిన్హా కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ చిత్రంలో విలన్ గా ఇప్పటికే జగపతిబాబు ఉండగా, మరొక విలన్ గా దేవగిల్ నటిస్తున్నారని సమాచారం. ఇండిపెండెన్స్ కు ముందు జరిగే ఫ్లాష్ బ్యాక్ లో దేవగిల్ కనిపిస్తారని చెప్తున్నారు. దేవగిల్ గతంలో మగధీర చిత్రం ద్వారా విలన్ గా ఎస్టాబ్లిష్ అయ్యారు.

బ్రిటిష్ నటి లారెన్ జె ఇర్విన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత. ఈ సినిమాలో నయనతార ప్రత్యేక గీతంలో నర్తించనుందని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X