మహేష్ కోసం రాజమౌళి విలన్.. వెండితెరపై ఆ వేడి తట్టుకోగలమా?
సినిమా ఇండస్ట్రీలో ఓ వర్గం స్టార్ హీరోలు కూడా విలన్ పాత్రలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అయితే లిస్ట్ లో కన్నడ, తమిళ్ యాక్టర్స్ ఎక్కువగా నిలుస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ తెరపై కథనాయకులతో ఫైట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక త్వరలో మహేష్ సినిమా కోసం కూడా ఒక స్టార్ హీరో ప్రతినాయకుడి పాత్రలో కనిపించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఆ హీరో మరెవరో కాదు.. కన్నడ స్టార్ సుదీప్. రాజమౌళి ఈగ సినిమాలో విలన్ గా కనిపించి మంచి క్రేజ్ అందుకున్న సుదీప్ ఆ తరువాత బాహుబలి, సైరా సినిమాల్లో కూడా స్పెషల్ రోల్స్ చేసి మెప్పించాడు. మొత్తానికి కన్నడ భాషలో ఒక స్టార్ ఇమేజ్ అందుకున్నప్పటికి ఇతర భాషల్లో విలన్స్ రోల్ చేశాడు సుదీప్. దబాంగ్ 3లో కూడా విలన్ గా నటించిన విషయం తెలిసిందే.

ఇక నెక్స్ట్ మహేష్ బాబు సర్కారు వారి పాటలో కూడా ఈ స్టార్ యాక్టర్ విలన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు- సుదీప్ లాంటి స్టార్ యాక్టర్స్ ని ఒకే తెరపై చూపిస్తే ఆ వేడిని తట్టుకోవడం కష్టమే. సుదీప్ విలన్ గా ఎలా యాక్ట్ చేస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక మహేష్ అతనికి ఎదురెళ్లితే అంతకంటే హై రేంజ్ లో హీరోయిజం క్లిక్కవ్వడం కాయం.. అందుకే దర్శకుడు పరశురామ్ సుదీప్ ని సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మారికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











