ప్రభాస్ డైరెక్టర్‌తో సుడిగాలి సుధీర్ మూవీ.. అత్యధిక బడ్జెట్‌తో.. హీరోయిన్ ఎవరంటే?

బుల్లితెర ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం లేని పేరు సుడిగాలి సుధీర్. టెలివిజన్ రంగంలో సీరియల్ హీరోల కంటే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. యాంకర్ గా, కమెడియన్ గా రాణిస్తూనే మరోవైపు వెండితెరపై హీరోగా తానేంటో నిరూపించుకునేందుకు తెగ కష్టపడుతున్నాడు. బుల్లితెరపై సూపర్ ఫుల్ గా ఎంటర్టైన్ చేసిన సుధీర్ సినిమాల్లో హీరోగా పర్వాలేదనిపించుకున్నాడు. ఇటీవల వచ్చి గాలోడు మూవీతో అంతకుముందు సినిమాలకంటే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను డైరెక్ట్ చేసిన దర్శకుడితో సినిమా చేస్తున్నాడు ఈ గాలోడు. ఆ వివరాల్లోకి వెళితే..

కామెడీ షో ద్వారా:బుల్లితెరపైకి ఈ మధ్య కాలంలో ఎంతో మంది కుర్రాళ్లు పరిచయం అయ్యారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సుడిగాలి సుధీర్ గురించి. బుల్లితెరపై సూపర్ హిట్ అయిన కామెడీ షో జబర్ధస్త్ ద్వారా పరిచయమైన సుధీర్.. సుడిగాలి సుధీర్ గా మారి అనతి కాలంలోనే ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగాడు.

Sudigali Sudheer Movie With Prabhas Director Dasarath News

వరుసగా చిత్రాలు..:జబర్దస్త్ కమెడియన్ గా సూపర్ పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ బుల్లితెరపై ఆద్యంతం ఎంటర్టైన్ చేశాడు. స్మాల్ స్క్రీన్ పై సుధీర్ తనదైన యాక్టింగ్, కామెడీ టైమింగ్ తోపాటు అప్పుడప్పుడు డ్యాన్స్ లతో అదరగొట్టేశాడు. ఇటు బుల్లితెరపై తనదైన శైలీలో ఎంటర్టైన్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో హీరోగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే త్రీమంకీస్, సాఫ్ట్ వేర్ సుధీర్, వాంటెడ్ పండుగాడ్ చిత్రాలు చేశాడు.

ఒరిగింది లేదు:సుడిగాలి సుధీర్ మొదట్లో హీరోగా చేసిన త్రీమంకీస్, సాఫ్ట్ వేర్ సుధీర్ అంతగా హిట్ కాలేదు. తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సమర్పించిన వాంటెడ్ పండుగాడ్ లో ఒక హీరోగా చేశాడు సుధీర్. ఇందులో సుధీర్ కు జోడిగా పాపులర్ యాంకర్, క్యూట్ బ్యూటి దీపిక పిల్లి నటించింది. అయితే ఈ సినిమా వల్ల కూడా సుధీర్ కు పెద్దగా ఒరిగింది లేదు. ఈ క్రమంలోనే గాలోడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుధీర్.

Sudigali Sudheer Movie With Prabhas Director Dasarath News

టాప్ డైరెక్టర్‌తో..:గతేడాది నవంబర్ 18న విడుదలైన సుధీర్ గాలోడు చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్ల పరంగా మాత్రం జోరు చూపించింది. రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల తెరకెక్కించిన ఈ మూవీని తర్వాత ఓటీటీలోకి రిలీజ్ చేయగా మంచి స్పందన దక్కించుకుంది. ఇప్పుడు అందరూ మెచ్చేలా సాలిడ్ హిట్ కొట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు ఈ గాలోడు. అందుకే ప్రభాస్ ను డైరెక్ట్ చేసిన టాప్ దర్శకుడితో సినిమా ప్లాన్ చేశాడు.

మంచు మనోజ్ తో శౌర్య..:సుధీర్ తర్వాతి సినిమాకు దర్శకత్వం వహిస్తుంది దశరథ్. ప్రభాస్ కు మిస్టర్ పర్ఫెక్ట్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దశరథ్ తో సుడిగాలి సుధీర్ ఓ మూవీ చేస్తున్నట్లు సమాచారం. సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ సినమాలతో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దశరత్ ఈ మధ్య సినిమాలు చేయడం లేదు. చివరిగా మంచు మనోజ్ తో 2016లో శౌర్య మూవీ తెరకెక్కించారు. ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో గ్యాప్ ఇచ్చారు.

Sudigali Sudheer Movie With Prabhas Director Dasarath News

ఇద్దరు హీరోయిన్స్.. విలన్ గా హీరో:ఇప్పుడు మంచి కథతో కమ్ బ్యాక్ హిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు దశరథ్. ఈ క్రమంలోనే ఆ కథ సుధీర్ కు కూడా నచ్చడంతో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ట్రై చేస్తున్నట్లు టాక్. అంతేకాకుండా ఈ చిత్రాన్ని సుధీర్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తున్నారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజిత పొన్నాడ చేయనుందని సమాచారం. ఆమెతోపాటు మరో హీరోయిన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. అన్నిటికిమించి ఇందులో ఒకప్పటి సీనియర్ హీరోను విలన్ గా చూపించబోతున్నారట. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X