ఏంటి.. బిగ్ బాస్‌లోకి సుడిగాలి సుధీర్ ఎంటరవుతున్నాడా? వెరీ ఇంట్రెస్టింగ్
Recommended Video
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 గురించిన విషయాలు జనాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రారంభానికి ముందే సంచలనంగా మారిన బిగ్ బాస్, ప్రారంభమయ్యాక కూడా ఆ సంచలనాలను కొనసాగిస్తోంది. గత వారం ఎలిమినేట్ అయిన హేమ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా బిగ్ బాస్ గురించిన చర్చలే వినిపిస్తున్నాయి. ఇంతలో బిగ్ బాస్‌లోకి సుడిగాలి సుధీర్ వస్తున్నాడనే వార్త బయటకు రావడం ఆసక్తి రేకెత్తిస్తోంది.

15 మంది కంటిస్టెంట్స్.. బిగ్ బాస్ హౌస్‌లో గొడవలు
జులై 21 వ తేదీన 15 మంది కంటిస్టెంట్స్ ప్రారంభమైన ఈ షోకి హోస్ట్‌గా నాగార్జున చేస్తున్నారు. అయితే మొదటి రోజు నుంచే బిగ్ బాస్ హౌస్‌లో గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మొదటి వారమే హేమ ఎలిమినేట్ కావడం, ట్రాన్స్‌జెండర్ తమన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం లాంటి ఇంట్రెస్టింగ్ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

జబర్దస్త్ ఫేం సుడిగాలి సుధీర్ పేరు కూడా
కాగా తాజాగా బిగ్ బాస్‌లోకి సుడిగాలి సుధీర్ వస్తున్నాడంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన ఎంటరయ్యేది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కాదని, తన కొత్త సినిమా ప్రమోషన్స్ కోసమని తెలుస్తోంది. బిగ్ బాస్‌తో సందడి చేసి తన కొత్త సినిమాను ప్రమోట్ చేసుకోవాలని సుధీర్ భావిస్తున్నట్లుగా సమాచారం.

వచ్చేస్తున్నాడు సాఫ్ట్‌వేర్ సుధీర్
బుల్లితెరపై రాణిస్తూనే వెండితెరపై హీరోగా సినిమాలు చేస్తున్నాడు సుడిగాలి సుధీర్. ఆయన తాజా సినిమా సాఫ్ట్‌వేర్ సుధీర్. ఈ సినిమా ప్రమోషన్స్ కోసమే సుధీర్ బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్తాడని టాక్ వినిపిస్తోంది. ప్రమోషన్స్ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో సుధీర్ ఇలా తన సినిమాపై హైప్ క్రియేట్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట. చూడాలి మరి బిగ్ బాస్ నాగార్జున.. సుధీర్‌కి ఛాన్స్ ఇస్తాడా? లేదా? అనేది.

కెత్తేమీ కాదు.. గతంలో కూడా
బిగ్ బాస్ హౌస్‌లో సినిమా ప్రమోషన్స్ చేయడం కొత్తేమీ కాదు. గత సీజన్స్‌లో కూడా ఇదే జరిగింది. మొదటి సీజన్ చేస్తున్నపుడు హోస్ట్‌గా ఉన్న ఎన్టీఆర్ తన జై లవకుశ ప్రమోషన్స్ చేశాడు. అదే బాటలో రెండో సీజన్ లో నాని కూడా తన దేవదాస్ సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు. ఇప్పుడు నాగార్జున సైతం అదే పని చేయబోతున్నాడని తెలుస్తోంది. వారి బాటలోనే సుడిగాలి సుధీర్ కూడా బిగ్ బాస్ వేదికగా ప్రమోషన్స్ చేస్తాడని అంటున్నారు.


Click it and Unblock the Notifications











