‘వరుడు’ కి అమ్మయిన సుహాసిని
ఒకప్పటి కథానాయిక, నేడు అక్క, వడిన, అమ్మ పాత్రల ద్వారా అలరిస్తున్న సుహాసిని ప్రస్తుతం తన భర్త మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న 'రావణ్" సినిమాకి తగిన సహాయ సహకారాలు అందిస్తోందట. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ హీరోగా గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న 'వరుడు" చిత్రంలో సుహాసిని నటిస్తోందట. అల్లు అర్జున్ తల్లి పాత్రలో కనిపిస్తుందని సమాచారమ్. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటిలో జరుగుతోంది. ఈ సందరర్భంగా నిర్మాత మాట్లాడుతూ మా సంస్థకిది ప్రతిష్టాత్మక చిత్రం. కథకు వరుడు అనే పేరు నూటికి నూరుపాళ్ళు సరిపోతుంది. అల్లు అర్జున్ పాత్ర, నటన హైలైట్ గా నిలుస్తాయి.
అల్లు అర్జున్ కథానాయకుడిగా యూనివర్శల్ మీడియా సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత డి.వి.వి దానయ్య. తమిళ హీరో ఆర్య ఇందులో ప్రతి నాయకుడిగా కనిపిస్తారు. ఈ సినిమాకి వరుడు అనే పేరుని ఖరారు చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చుతుంది. ఈయన సరసన ఓ కొత్త అమ్మాయి నటిస్తోంది. భారీవ్యయంతో నర్మిస్తున్న ఈ చిత్రం కనువిందుగా వుంటుంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మఅందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











