ఐశ్వర్య రాయ్ తో ‘ఆ’ సినిమా చేయిస్తానంటున్న లేడి డైరక్టర్..!?
మణిరత్నం దర్శకత్వంలో రీసెంట్ గా విడుదల చిత్రం 'రావణ్", హిందీలో ఆవరేజ్ అనిపించుకొన్నా, తమిళంలో మాత్రం ప్రక్షాదరణ చాలా బాగుందని సమాచారం. ఈ చిత్రానికి డైలాగులు రాసిన సుహాసిని మణిరత్నం, ఐశ్వర్య బచ్చన్ కి చాలా దగ్గరైంది. అదే చనువుతో లేడి ఓరియంటెడ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ అందులో ఐశ్వర్య రాయ్ ని లీడ్ రోల్ చేయిస్తున్నట్టు సమాచారం.
అయితే అందాల తార ఐశ్వర్య రాయ్ సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో తనకు నటన తెలియదని చాలా మంది కొట్టిపడేశారు. ఓ పది సినిమాలు చేసిన తర్వాత కానీ ఐష్ సరైన నటన కనబర్చలేకపోయింది. ఆల్ మోస్ట్ గ్లామర్ పాత్రలకే పరిమితమైన ఈ సుందరాంగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేయాలనుకుంటోందని సమాచారం. అది కూడా నటి సుహాసిని దర్శకత్వంలో చేయాలని అనుకుంటోందట. మరి..ఐష్ అలాంటి వీరోచితమైన సినిమాలు చేస్తే జనాలు చూస్తారంటారా?
ఐశ్వర్య రాయ్ సుహాసిని రావణ్ విక్రమ్ అభిషేక్ బచ్చన్ మణిరత్నం aishwarya rai suhasini raavan vikram abhishek bachchan maniratnam


Click it and Unblock the Notifications