చిరంజీవి సంచలన నిర్ణయం.. డైరెక్టర్‌తో కలిసి హీరోయిన్‌ను ఇరికించేందుకు ప్లాన్.!

By Manoj

తెలుగు సినిమాపై తనదైన మార్క్‌ను చూపిస్తూ టాప్ హీరోగా కొనసాగుతూ వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. అప్పుడెప్పుడో చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన ఆయన... బడా హీరోల నుంచి పోటీని ఎదుర్కొని నిలబడగలిగారు. ఆ తర్వాత ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరో అయిపోయారు. మధ్యలో రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటికీ... తిరిగి తనకు ఇష్టమైన సినిమా ప్రపంచలోకే వచ్చేశారు. ఈ క్రమంలోనే వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. తాజాగా చిరంజీవి హీరోయిన్ విషయంలో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఆ వివరాలు మీకోసం.!

చిరంజీవి దూకుడుకు అసలు కారణం ఇదే

చిరంజీవి దూకుడుకు అసలు కారణం ఇదే


సుదీర్ఘ విరామం తర్వాత ‘ఖైదీ నెంబర్ 150' మూవీతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్లనూ అంతే స్థాయిలో రాబట్టింది. దీంతో ఆయన రెట్టించిన ఉత్సాహంతో వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది ‘సైరా: నరసింహారెడ్డి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

భారీ నిరుత్సాహం... పక్కా ప్లాన్‌తో ముందుకు

భారీ నిరుత్సాహం... పక్కా ప్లాన్‌తో ముందుకు

ఎన్నో అంచనాలతో విడుదలైన ‘సైరా: నరసింహారెడ్డి' నిరాశనే మిగిల్చింది. ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్లు రాబట్టడంలో విఫలమైంది. దీంతో హీరోగా చిరంజీవికి, నిర్మాతగా రామ్ చరణ్‌కు నిరుత్సాహం తప్పలేదు. ఈ సినిమా ప్రభావం వల్ల మెగాస్టార్ తన ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు.

బడా డైరెక్టర్‌తో మూవీ... ఆచార్య పోరాటం

బడా డైరెక్టర్‌తో మూవీ... ఆచార్య పోరాటం

ప్రస్తుతం చిరంజీవి.. బడా డైరెక్టర్ కొరటాల శివతో కలిసి ‘ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. మ్యాట్నీ మూవీస్ సంస్థతో కలిసి రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇందులో చిరు.. నక్సలైట్ పాత్రను పోషిస్తున్నారు. దేవాదాయ భూముల ఆక్రమణలపై ఆయన చేసే పోరాటంతోనే సినిమా తెరకెక్కుతోంది.

మెగా మల్టీస్టారర్... చరణ్‌పై అనుమానాలు

మెగా మల్టీస్టారర్... చరణ్‌పై అనుమానాలు

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ కూడా ధృవీకరించింది. అయితే, లాక్ డౌన్ ప్రభావంతో చెర్రీ నటిస్తున్న RRR షూటింగ్ కూడా వాయిదా పడింది. దీంతో అతడికి డేట్స్ సమస్య వచ్చింది. ఈ కారణంగా చరణ్.. ‘ఆచార్య'లో నటించకపోవచ్చన్న టాక్ కూడా వినిపిస్తోంది.

చిరంజీవి దూకుడు... యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్

చిరంజీవి దూకుడు... యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్

కొరటాల శివతో సినిమా అయిపోయిన తర్వాత మెగాస్టార్ చేయబోయే ప్రాజెక్టుల గురించి ఇటీవల క్లారిటీ వచ్చింది. ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన చిరంజీవి.. ‘ఆచార్య' తర్వాత సుజిత్, బాబీ, మెహర్ రమేశ్‌తో సినిమాలు చేయబోతున్నట్లు ప్రకటించారు. వీటిలో సుజిత్ తెరకెక్కించేది.. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసీఫర్' రీమేక్ కావడం గమనార్హం.

హీరోయిన్ విషయంలో చిరంజీవి డేరింగ్ డెసీషన్

హీరోయిన్ విషయంలో చిరంజీవి డేరింగ్ డెసీషన్

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో హీరో పృధ్వీరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘లూసీఫర్'. పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో సాగే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో దీన్ని చిరు రీమేక్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఒరిజినల్‌లో హీరోయిన్ లేకపోయినా.. తెలుగులో మాత్రం ఆ పాత్రను కావాలని క్రియేట్ చేశారట. ఇందుకోసం ఓ స్టార్ హీరోయిన్‌ను తీసుకుంటారని సమాచారం.

Recommended Video

Prabhas Special Request To Ram Charan
ఇరికించేందుకు ప్లాన్.. వర్కౌట్ అవుతుందా..?

ఇరికించేందుకు ప్లాన్.. వర్కౌట్ అవుతుందా..?

మాతృకలో లేకపోయినా.. చిరంజీవి నటించే రీమేక్‌లో హీరోయిన్‌ను పెట్టబోతుండడం చాలా మందిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే, హీరోయిన్ పాత్రను కావాలని ఇరికించినట్లుగా కాకుండా.. రియాలిటీకి దగ్గరగా ఉండేలా చూపించేందుకు సుజిత్ ప్రయత్నిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. సీరియస్‌గా సాగే సినిమాలో హీరోయిన్‌ ప్రయోగం వర్కౌట్ అవుతుందేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X