Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహేశ్, ఎన్టీఆర్, చరణ్ తర్వాత బన్నీ.. అదే తరహా ప్రయోగం చేస్తున్న క్రియేటివ్ డైరెక్టర్.!
వక్కంతం వంశీ డైరెక్షన్‌లో వచ్చిన 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ సినిమా ఫలితం ప్రభావమో ఏమో గానీ బన్నీ చాలా రోజుల వరకు మరో ప్రాజెక్టును పట్టాలెక్కించలేదు. దీంతో 2019లో అతడు నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. కానీ, ప్రస్తుతం అతడు నటిస్తున్న 'అల.. వైకుంఠపురములో..' మూవీ మాత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది రిలీజ్ కాకముందే అతడు మరో సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏంటా న్యూస్.? వివరాల్లోకి వెళితే...

వాళ్లందరితో కలిసి వస్తున్నాడు
ప్రస్తుతం అల్లు అర్జున్.. తనకు రెండు సూపర్ హిట్ చిత్రాలను అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి ‘అల.. వైకుంఠపురములో..' అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో అతడి సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ టబు, నవదీప్, సుశాంత్, సముద్రఖని, నివేదా పేతురాజ్, మురళీ శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి రానుంది.

రికార్డుల మీద రికార్డులు
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్‌కు ముందే రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా టీజర్ అత్యధిక వ్యూస్ సాధించి సత్తా చాటగా.. ఇందులోని ‘సామజవరగమన', ‘రాములో రాములా' అంటూ సాగే పాటలు చరిత్ర సృష్టించాయి. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి.

అది ఆపేసి.. దీన్ని షురూ చేస్తున్నాడు
వాస్తవానికి అల్లు అర్జున్.. దిల్ రాజు బ్యానర్‌పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటిస్తున్నట్లు ప్రకటించాడు. ఈ సినిమాకు ‘ఐకాన్' అనే టైటిల్ కూడా అనుకున్నారు. కానీ, ఈ మూవీని ఆపేసి, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రాజెక్టును ఓకే చేసేశాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. బన్నీ కూడా జనవరి రెండో వారం నుంచి షూటింగ్‌లో పాల్గొంటాడని టాక్.

తమిళ సినిమాను గుర్తు చేసేలా
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కబోతుందని అంటున్నారు. తమిళ సినిమాలను గుర్తు చేసేలా ఇందులో అందరి క్యారెక్టర్లు డిజైన్ చేశాడట సుక్కూ. ముఖ్యంగా బన్నీ ఇందులో గుబురు గెడ్డంతో కనిపిస్తాడని అంటున్నారు. అలాగే, హీరోయిన్ రష్మిక ఫారెస్ట్ ఆఫీసర్‌గా నటిస్తుందని అంటున్నారు.

మహేశ్, ఎన్టీఆర్ తర్వాత అల్లు అర్జున్
తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. సుకుమార్ సినిమా అంటే రివేంజ్ డ్రామాలకు పెట్టింది పేరు. గతంలో అతడు మహేశ్‌తో ‘1 నేనొక్కడినే', తారక్‌తో ‘నాన్నకు ప్రేమతో', రామ్ చరణ్‌తో ‘రంగస్థలం' ఇదే థీమ్‌తో తెరకెక్కించాడు. ఇప్పుడు బన్నీ సినిమాను కూడా అదే తరహాలో రూపొందిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.