'పుష్ప' కోసం గట్టిగానే వాడుతున్నారు.. 3నిమిషాల కోసం మరో 3కోట్లు?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో తెలియదు గాని సినిమాకు సంబంధించిన విశేషాల గురించి వింటుంటే ఇప్పుడే రికార్డుల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా ఉంది. పాన్ ఇండియా సినిమా కావడంతో మునుపెన్నడు లేని విధంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శక్తినంతా ధార పోస్తున్నాడట. ఇక సుకుమార్ కూడా బడ్జెట్ విషయంలో లెక్కలేమి పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
ఆరు నిమిషాల యాక్షన్ సీన్ కోసం ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఇటీవల ఒక న్యూస్ వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక స్పెషల్ సాంగ్ కోసం మరొక మూడు కోట్లు ఖర్చు చేయనున్నారట. దేవి శ్రీ ప్రసాద్ సరికొత్త మ్యూజిక్ తో ట్యూన్స్ సెట్ చేస్తుండగా సుకుమార్ భారీ సెట్స్ తో మరీంత హైప్ క్రియేట్ చేయనున్నాడట. అడవుల్లో సాగే మూడు నిమిషాల పాట కోసం అల్లు అర్జున్ స్పెషల్ స్టంట్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.

విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఆడియెన్స్ కి సరికొత్త థ్రిల్ ఇవ్వనున్నాయట. మొత్తంగా సుకుమార్ రూరల్ డ్రామాతోనే తన అసలైన టాలెంట్ ని ఇండియాకు పరిచయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతగా హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ అనంతరం ఎంతవరకు కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











