పుష్ప విషయంలో సుకుమార్ డేరింగ్ స్టెప్.. అస్సలు తగ్గట్లేదుగా
టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద సినిమాలపై మళ్ళీ కన్ఫ్యూజన్ మొదలైంది. గత ఏడాది ఎప్పుడో రావాల్సిన సినిమాలు ఇప్పటికి కూడా విడుదలకు నోచుకోలేదు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా రిలీజ్ డేట్ విషయాల్లో ఎవరు ఊహించని విధంగా మళ్ళీ మార్పులు జరగబోతున్నాయి. ఇండస్ట్రీలో మరోసారి పెద్ద సినిమాల దర్శక నిర్మాతలు కూర్చొని మాట్లాడుకునే సమయం వచ్చింది.
కరోనా తగ్గిందని అనుకోని ఈ ఏడాది దాదాపు స్టార్ హీరోలందరి సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కరోనా వల్ల ఒక్కొక్కరు మళ్ళీ డేట్స్ చేంజ్ చేసుకోక తప్పడం లేదు. అయితే పుష్ప విషయంలో మాత్రం అలాంటి మార్పులు ఉండకపోవచ్చని టాక్ వస్తోంది. దర్శకుడు సుకుమార్ షూటింగ్ ను పక్కా ప్లాన్ తో అనుకున్న సమయానికి పూర్తి చేయాలని అనుకుంటున్నాడు.

కోవిడ్ ప్రభావం ఎక్కువగా పడకుండా తక్కువమంది యూనిట్ సభ్యులతో షూటింగ్ పనులను పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఆగస్ట్ 13న సినిమాను పూర్తి చేయాలని డేట్ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ డేట్ విషయంలో ఎలాంటి మార్పులు చేయకూడదని సుకుమార్ డేరింగ్ గా వెళుతున్నట్లు సమాచారం. ఎందుకంటే మళ్ళీ ఆ డేట్ మిస్సయితే మరో డేట్ దొరకదు. పాన్ ఇండియా సినిమా కాబట్టి పోటి ఎక్కువగా లేని సమయంలోనే రిలీజ్ చేయాలని సుకుమార్ ప్లాన్ చేసుకుంటూ వెళుతున్నాడు.


Click it and Unblock the Notifications











