twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నితిన్ నెక్ట్స్ స్టైలిష్ ఫిల్మ్ మేకర్ తో...?

    By Srikanya
    |

    హైదరాబాద్ : నితిన్ కి చెడ్డరోజులు..ఇష్క్ సినిమాతో పోయినట్లున్నాయి. గుండె జారి గల్లంతయ్యిందే చిత్రం ఘన విజయంతో నితిన్ కు వరస ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. తాజాగా టాలీవుడ్ స్టార్ డైరక్టర్, స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ నుంచి ఆఫర్ వచ్చినట్లు సమాచారం.

    సుకుమార్ ప్రస్తుతం మహేష్ తో చిత్రం చేస్తున్నారు. ఆ చిత్రం అనంతరం నితిన్ తో రెడీ అవ్వనున్నాడని వినపడుతోంది. ఈ మేరకు చర్చలు జరిగాయని చెప్పుకుంటున్నారు. నితిన్ ప్రస్తుతం తాను రొమాంటిక్ జనర్ చిత్రాలు మాత్రమే చేస్తాననటం కూడా ప్లస్ అయ్యిందంటున్నారు.

    ప్రస్తుతం నితిన్ 'కొరియర్ బాయ్ కళ్యాణ్' చిత్రం షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. గౌతం మీనన్ నిర్మిస్తున్న ఈచిత్రానికి ప్రేమ్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. యామి గౌతం నితిన్ సరసన హీరోయిన్ గా ఎంపికయింది. కార్తీక్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

    ఈ సినిమా గురించి దర్శకుడు ప్రేమ్‌సాయి మాట్లాడుతూ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఓ సరికొత్త పాత్రలో నితిన్ నటిస్తున్న ఈ చిత్రం ఆయన గత చిత్రాల్లాగే విజయవంతమవుతుందని అన్నారు. సత్యం రాజేష్, హర్ష, జైసంతానం, వి.టి.వి.గణేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్, ఎడిటింగ్: ఆంథోనీ, కెమెరా: ఓంప్రకాష్, నిర్మాత: గౌతం వాసుదేవమీనన్, దర్శకత్వం: ప్రేమ్‌సాయి.

    ఈ సినిమాల తర్వాత మరో రెండు ప్రాజెక్టులు నితిన్‌కు ఖరారయ్యాయి. అందులో కిక్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్వకత్వంలో రూపొందబోయే సినిమా ఒకటి కాగా, మరొకటి అలా మొదలైంది, జబర్దస్త్ చిత్రాల ఫేం నందినీరెడ్డి దర్శకత్వంలో చేయనున్నారు. ఈ చిత్రాలు 2014లో సెట్స్ పైకి వెళ్లనున్నాయి.

    English summary
    latest buzz making rounds in the filmnagar circles that Nithin will soon team up stylish filmmaker Sukumar and the former has given his nod. Recently Nithin has informed that he'll concentrate more on romantic entertainers and it is known fact that Sukumar is best at weaving unique love stories.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X