twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఖరారు

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఈ తరంలో లవ్ స్టోరీర్ ని ప్రతిభావంతంగా హ్యాండిల్ చేయటంలో దర్శకుడు సుకుమార్ ది అందివేసిన చెయ్యి. ఆయన ప్రతీ చిత్రంలోనూ లవ్ స్టోరీతో యూత్ ని కనెక్టు చేస్తూంటారు. అందుకే ఆ చిత్రాలు యువతను బాగా ఆకట్టుకుంటున్నారు. ఆర్య నుంచి మొన్నటి హండ్రెడ్ పర్శంట్ లవ్ దాకా ఆయన చిత్రాలు ఎక్కువగా ప్రేమ కథలుపైనే డిపెండ్ అయ్యాయి. జగడం వంటి యాక్షన్ చిత్రాలు చేసినా అవి పేరు తేలేకపోయాయి.

    ఇక ఎన్టీఆర్ చిత్రాలలో కూడా లవ్ ట్రాక్ కు ఓ ప్రత్యేకమైన స్ధానం ఉంటుంది. ఊసరవెల్లి వంటి చిత్రాలు మంచి ప్రేమ కథగా వచ్చాయి. ఈ నేపధ్యంలో ఓ యూత్ ఫుల్ యాక్షన్ లవ్ స్టోరీ చెయ్యటానికి సుకుమార్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ సమాచారం. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ కి తగినట్లుగా ఓ స్టోరీ లైన్ ని ఆల్రెడీ సుకుమార్ ఇప్పటికే ఎన్టీఆర్ కి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తారని సమాచారం.

    ప్రస్తుతం ఎన్టీఆర్...బాద్షా లో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం 'బాద్‌షా'. కాజల్‌ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ భారీ చిత్రం గురించి నిర్మాత బండ్ల గణేష్‌ బాగా నమ్మకంగా ఉన్నారు. ''పేరుకి తగ్గట్టే.. శక్తిమంతమైన కథ ఇది. ఎన్టీఆర్‌ని ఇది వరకెప్పుడూ చూడని కోణంలో చూపిస్తున్నాం. పాత్ర తీరే కాదు.. ఆయన గెటప్‌ కూడా సరికొత్తగా ఉంటుంది''అని నిర్మాత తెలిపారు.ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పాత్ర కూడా డిఫెరెంట్ గా ఉంటుంది. ఆ పాత్ర గురించి చెబుతూ నిర్మాత బండ్ల గణేష్...సేవకుడిగా కాదు.... పాలకుడిగా బతకడమే అతనికిష్టం. బుల్లెట్‌లా కాదు, దాని లక్ష్యాన్ని శాసించే ట్రిగ్గర్‌లా ఉండడమే అతనికిష్టం. అందుకే తనకు తానే 'బాద్‌షా' అని ప్రకటించుకొన్నాడు. ఇంతకీ ఎవరతను? అతని లక్ష్యమేమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు బండ్ల గణేష్‌.

    ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ గురించి శ్రీనువైట్ల చెప్తూ...అతనొక్కడే. కానీ ఓ సైన్యం నడిచొస్తున్నట్టుంటుంది. చాలా తక్కువ మాట్లాడతాడు.. కానీ ప్రతి మాటా ఓ మిస్సైల్‌లా దూసుకొస్తుంది. ఒక్కసారే మాటిస్తాడు... ప్రాణం ఉన్నంత వరకూ దానికి కట్టుబడి ఉంటాడు. అందుకే... అతను 'బాద్‌షా' అయ్యాడు. ఇంతకీ అతని గమ్యం ఏమిటో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు శ్రీను వైట్ల.

    English summary
    Ntr to have zeroed to Sukumar's story as his next venture and is also heard that big producer Bhogavalli Prasad is going to produce this movie.NTR need no introduction as super actor and dancer. But the combination is definitely going to set new expectations for NTR in new romantic look.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X