మహేష్ బాబుతో ఆ డైరక్టర్?
మహేష్ బాబుతో సినిమా చేయాలని సీనియర్స్, జూనియర్స్ అనే తేడా లేకుండా అందరు డైరక్టర్స్ కలలు కంటూంటారు. అయితే ఇప్పుడా అవకాశం సుకుమార్ ని వరించిందని తెలుస్తోంది. ఆర్యతో హిట్టు కొట్టి జగడంతో టెక్నికల్ గా ప్రూవ్ చేసుకున్న సుకుమార్ ప్రస్తుతం ఆర్య-2 ని రూపొందించి రిలీజ్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమయంలో ఆర్య-2 నిర్మాతలు ఆదిత్య ఆర్ట్స్ వారు మహేష్ డేట్స్ తీసుకున్నట్లు తెలిసింది. ఇక మహేష్ కు సుకుమార్ నామమాత్రంగా స్టోరీ లైన్ నేరేట్ చేసినట్లు సమాచారం. మహేష్ కు అది నచ్చటంతో పూర్తి స్ధాయి స్క్రిప్టుకు ఓ ప్రక్క స్టోరీ సిట్టింగ్స్ జరుపుతున్నారని తెలుస్తోంది. ఇక మహేష్ ని ఎవరూ చూపని కోణంలో క్యారక్టరైజేషన్ ప్రధానంగా చూపుతానని మాట ఇచ్చినట్లు చెప్తున్నారు. అయితే త్రివిక్రమ్, శ్రీనువైట్ల చిత్రాల అనంతరం ఈ ప్రాజెక్టు ముందుకెళ్తుందని ఫిల్మ్ నగర్ సమాచారం. ఇక ఆర్య-2 లో అల్లు అర్జున్, నవదీప్, కాజల్ ప్రధాన పాత్రలుగా కథ నడుస్తుంది.


Click it and Unblock the Notifications











