పొరపాటు ఎక్కడ జరిగింది? మహేష్ బాబుకు సుకుమార్ క్షమాపణ చెప్పారా?
Recommended Video

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ల్యాండ్ మార్క్ మూవీ 'మహర్షి' చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు-సుకుమార్ కాంబినేషన్లో సినిమా మొదలవ్వాల్సి ఉండగా... వారం క్రితం ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుకుమార్ ఉన్నట్టుండి మహేష్ బాబు సినిమా పక్కన పెట్టేసి అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు.
సుకుమార్ నుంచి వచ్చిన ఈ ప్రకటన అభిమానులను మాత్రమే కాదు.. ఇండస్ట్రీవారిని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఓ వైపు మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి మహేష్ బాబు మూవీ చేయబోతున్నట్లు కొన్ని రోజులుగా ప్రకటనలు చేస్తూ వచ్చిన సుక్కూ... ఒక్కసారిగా నిర్ణయం మార్చుకోవడం హాట్ టాపిక్ అయింది.

మహేష్ బాబు చిరాకు పడేలా చేశాయా?
ఈ పరిణామాలు ఇటు మహేష్ బాబు కూడా చిరాకు పడేలా చేశాయట. తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా తన కోసం రాస్తున్న స్క్రిప్టు పక్కన పెట్టేసి మరో ప్రాజెక్టు మీదకు జంప్ అవ్వడంతో ఆగ్రహించిన సూపర్ స్టార్... ఈ ప్రాజెక్టును రద్దయినట్లు వెల్లడిస్తూ ప్రకటన చేశారు.

వెంటనే కౌంటర్
తన తర్వాతి చిత్రం అల్లు అర్జున్‌తో చేయబోతున్నట్లు సుకుమార్ నుంచి ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే.... మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా సుకుమార్ సినిమా క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల రద్దయినట్లు' ప్రకటిస్తూ కౌంటర్ ఇచ్చారు.

వాస్తవానికి ఏం జరిగింది?
వాస్తవానికి జరిగిన విషయం ఏమిటంటే... మహేష్ బాబు కోసం సుకుమార్ రాసుకున్న స్క్రిప్టు ఇటీవలే ఆయనకు వినిపించారు. అయితే ఆ స్క్రిప్టుతో సంతృప్తి పడని మహేష్ మార్పులు కోరాడట. అయితే ఇప్పటికిప్పుడు మార్పులు సాధ్యం కాదని, కనీసం ఆరు నెలల సమయం పడుతుందని చెప్పారట సుకుమార్. ఎలాగూ తన స్క్రిప్టు పూర్తి చేయడానికి సుకుమార్ అనుకున్న సమయానికంటే ఎక్కువ తీసుకుంటాడు కాబట్టి ఈ గ్యాపులో అనిల్ రావిపూడి ప్రాజెక్ట్‌కు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

మిస్ అండర్‌స్టాండింగ్
అయితే ఓ వైపు తాను స్క్రిప్టు చేస్తుంటే... మహేష్ బాబు వేరే సినిమా చేయడానికి నిర్ణయం తీసుకుకోవడం అటు సుకుమార్‌ను కూడా ఆలోచనలో పడేశాయి. దీన్ని ఆయన మరోలా అర్థం చేసుకుని బన్నీతో నెక్ట్స్ ప్రాజెక్టు చేస్తున్నట్లు ప్రకటించాడు. బన్నీ ఇప్పటికప్పుడు తనతో సినిమా చేయడానికి సిద్ధంగా లేకున్నా... తన పంతం నెగ్గించుకోవడానికే బన్నీ తర్వాతి సినిమా కోసం ఇప్పుడే అనౌన్సమెంట్ ఇచ్చేశాడని టాక్.

ఒత్తిడి పెంచిన మైత్రి
ఈ పరిణామాలు మైత్రి మూవీ మేకర్స్, మహేష్ బాబు మధ్య సంబంధాలు దెబ్బతినే విధంగా ఉండటంతో వారు వెంటనే సుకుమార్ మీద ఒత్తిడి పెంచి మహేష్ బాబును కలిసేలా ఏర్పాట్లు చేశారట.

క్షమాపణలు చెప్పారా?
తాను ఆవేశ పూరితంగా, ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తీసుకున్న నిర్ణయం పట్ల సుుమార్.. మహేష్ బాబుకు క్షమాపణలు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే పూర్తి స్క్రిప్టుతో వస్తానని మహేష్ బాబుకు వెల్లడించారట.


Click it and Unblock the Notifications











