ఉప్పెనతో లాభాలు.. మరో మెగా హీరోపై ఇన్వెస్ట్ చేస్తున్న సుకుమార్
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉప్పెన సినిమా చాలా రోజుల తరువాత ఒక సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ అయితే మొత్తానికి పర్ఫెక్ట్ డెబ్యూతో మెగా ఫ్యాన్స్ కు మంచి కిక్కిచ్చాడు. దాదాపు 70కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఇక సినిమాను డైరెక్ట్ చేసింది బుచ్చిబాబు అయినప్పటికీ అతని గురువుకే భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.
ఇక వచ్చిన లాభాల్లో సుకుమార్ కు కూడా వాటా గట్టిగానే వచ్చిందట. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ తో పాటు సుకుమార్ కూడా సినిమాపై కొంత ఇన్వెస్ట్ చేశాడు. సినిమా సెట్స్ పైకి రావడానికి ముఖ్య కారణం కూడా సుకుమార్ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఉప్పెన వచ్చిన ప్రాఫిట్స్ ను మరో మెగా హీరో సినిమాపై కూడా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు టాక్ వస్తోంది. ఆ హీరో మరెవరో కాదు. వైష్ణవ్ తేజ్ అన్నయ్య సాయి ధరమ్ తేజ్.

సాయి ధరమ్ తేజ్ కూడా సుకుమార్ రైటింగ్స్ లో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమాను సుకుమార్ తో పాటు BVSN ప్రసాద్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆ సినిమాపై కూడా సుకుమార్ చాలా నమ్మకంతో ఉన్నారట. అందుకే బడ్జెట్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా భారిగానే ఖర్చు పెడుతున్నారట. మరి ఆ సినిమాతో సుకుమార్ ఎంతవరకు లాభాలు అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











