సుకుమార్‌తో సినిమా.. మూడింటిలో ఒకదానికి ఫిక్స్ అయిన మహేష్!

Recommended Video

Mahesh Accepts For New Movie

సూపర్ స్టార్ మహేష్ బాబు సీఎం భరత్ గా అందరిని మాయ చేసాడు. ఆ మాయనుంచి మహేష్ ఫాన్స్ బయటకు రావాలంటే ఈ సూపర్ స్టార్ మరో సినిమా మొదలు పెట్టాల్సిందే. భరత్ అనే నేను చిత్రం తరువాత వంశి పైడిపల్లి దర్శకత్వంలో నటించాలని మహేష్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అశ్విని దత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ నుంచి ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉండగానే సుకుమార్ తో సినిమాకు కూడా మహేష్ ఒకే చెప్పేశాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రం నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఈ మహేష్ తో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో సుకుమార్ ఉన్నాడు. అందుకోసమే మూడు కథలని మహేష్ కు ఇటీవల వినిపించాడట సుక్కు. వాటిలో ఒకదానిని ఫైనల్ చేసి పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయాలని సుక్కుని ఆదేశించాడట.

Sukumar is busy with developing Mahesh Script

ఆ కథ కూడా రంగస్థలం చిత్రానికి వలే వైవిధ్యంతో కూడుకున్నదని తెలుస్తోంది. 1 నేనొక్కడనే లాగా నిరాశపరచకుండా పక్కాగా స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఈ దర్శకుడు బిజీగా ఉన్నాడు. రంగస్థలం చిత్రంతో తాను స్క్రీన్ ప్లే నడిపించడంలో సుకుమార్ తన ప్రత్యేకత చాటుకున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X