Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కావాలనే పుష్ప2 లీకులు.. మొత్తానికి పెద్ద స్కెచ్చే ఉన్నట్టుందే!
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి రెండు మూడు రోజుల నుంచి పెద్ద ఎత్తున మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది. పుష్ప సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండగా దాని వెనుక ఒక కారణం ఉందనే వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే
Recommended Video
అందరి ఫోకస్ పుష్ప మీదే
అల వైకుంఠపురంలో సినిమా తో సూపర్ సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత సినిమాని సుకుమార్ తో అనౌన్స్ చేశాడు. పుష్ప పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. రంగస్థలం తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా కావడంతో పాటు ఆర్య, ఆర్య-2 తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగా ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో డి గ్లామర్ లుక్ లో కనిపిస్తుండడంతో సినిమా మీద అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.
మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం
ఇలాంటి సమయంలో ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రింట్,ఎలక్ట్రానిక్, డిజిటల్ అని తేడా లేకుండా దాదాపు అన్ని మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం మీద యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. ఈ సినిమాను బాహుబలి తరహాలో రెండు భాగాలుగా రిలీజ్ చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇది కేవలం లం ప్రచారానికే పరిమితం అవుతుందా లేక నిజంగానే రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారా అనే అంశం మీద అ రెండు మూడు రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి.
సుకుమార్ టీం లీకులు
అయితే ఈ అంశం మీద ఇప్పటికీ యూనిట్ నుంచి సరైన క్లారిటీ లేదు. నిజానికి సుకుమార్ అనుకున్న కథ ప్రకారం సినిమా నిడివి చాలా ఎక్కువగా వస్తుంది. దీంతో రెండు భాగాలుగా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో అనే ఆలోచన వచ్చిన మాట వాస్తవమే, కానీ దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. ఈ అంశం మీద కావాలనే మీడియాకు సుకుమార్ టీం లీకులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మీడియా స్పందన ఏమిటి ? ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అనే అంశాల మీద ఒక క్లారిటీ వచ్చాక అప్పుడు ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలా ? లేక ఒక భాగానికి పరిమితం చేయాలా ? అనే అంశం మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
వారిచ్చిన రిపోర్ట్ ప్రకారమే
అయితే ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమా కావడంతో పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అవుతుండటంతో ముందు రెండు భాగాలు అనే ఆలోచన బాగానే అనిపించదట. కానీ ఒకవేళ పొరపాటున మొదటి భాగం తేడా పడితే పరిస్థితి ఏమిటి అనే ఆలోచనతో ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా చర్చల దశలోనే ఉంచినట్లు తెలుస్తోంది.
ఎందుకంటే బాహుబలి ఒక సోషియో ఫాంటసీ సినిమా కాబట్టి ఈ రెండు భాగాల కోసం ప్రజలు విపరీతంగా ఎదురు చూశారు. కానీ సాధారణ సినిమాల కోసం అంతలా ప్రజలు ఎదురు చూస్తారా లేదా అనేది కూడా ఇక్కడ చూడాల్సిన అంశమే. అందుకే జనం నుంచి వచ్చే రెస్పాన్స్ ను బట్టి ఈ రెండు భాగాల ప్రకటన ఉండే అవకాశం ఉంది. సుకుమార్ టీం ఈ రెస్పాన్స్స్ లను మానిటర్ చేస్తోందని వారు ఇచ్చిన డీటెయిల్డ్ రిపోర్ట్ ప్రకారం సుకుమార్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.